షాక్:పవర్ మంత్రికే పవర్ కట్, పవర్ కట్ పై ప్రత్యర్థులపై ట్విట్టర్ లో మంత్రి ఇలా..

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు వింత అనుభవం ఎదురైంది.విద్యుత్ అంశంపై మంత్రి ప్రసంగిస్తుండగానే విద్యుత్ కోతలు చోటుచేసుకొన్నాయి.

వారణాసి:కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ విద్యుత్ గురించి మాట్లాడే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పాటైతే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని హమీ ఇచ్చారు.

When A Power Cut Was Perfectly Timed For Power Minister Piyush Goyal

అయితే మంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తుండగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంశంపై మంత్రి మాట్లాడుతుండగానే ఈ ఘటన చోటుచేసుకొంది. దీంతో స్థానిక బిజెపి నాయకులు చెవులు కొరుక్కొన్నారు. ఆహ ఏం టైమింగ్ అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకొన్నారు.

అయితే ఈ అంశాన్ని కూడ సమాజ్ వాదీ పార్టీపై విమర్శలు గుప్పించేందుకుగాను బిజెపి ఉపయోగించుకొంది. విద్యుత్ లేకుండానే మంత్రి మీడియో సమావేశం నిర్వహించిన విషయమై తీసిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి సమాజ్ వాదీ పార్టీ మంత్రి విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+