Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నాడిఎంకె పరిణామాలపై అజిత్ మౌనం, జయమానసపుత్రుడి మౌనానికి కారణమేమిటి?

తమిళ సినీ నటుడు అజిత్ అన్నాడిఎంకె పరిణామాల విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదంటూ చర్చ సాగుతోంది. అంతేకాదు జయకు అత్యంత సన్నిహితంగా ఉన్నఅజిత్ ఈ పరిణామాలపై మౌనాన్ని పాటిస్తున్నారు.

చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మానసపుత్రుడిగా ..రాజకీయ వారసుడిగా ప్రచారంలో ముందున్న ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ తమిళనాడులో చోటు చేసుకోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నోరు విప్పలేదు.ఇతర సినీ నటులు నోరుతెరిచినా అజిత్ మాత్రం నోరుతెరవకపోవడం చర్చనీయాంశంగా మారింది.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సినీ నటుడు అజిత్ కుమార్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. అజిత్ ను జయలలిత తన మానస పుత్రుడిగా చూసేవారు.

జయలలిత తర్వాత అజిత్ కుమార్ పార్టీ సారధ్య బాధ్యతలను తీసుకొంటారని కూడ మీడియాలో ప్రచారం సాగింది.జయలలిత మరణించిన సమయంలో అజిత్ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు.

జయలలిత చివరి చూపుకు కూడ అజిత్ నోచుకోలేదు. జయలలిత అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయన జయ సమాధి వద్ద నివాళులర్పించారు.

అన్నాడిఎంకెలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. పన్నీర్ సెల్వం, శశికళ గ్రూపులుగా చీలిపోయింది. అన్నాడిఎంకె శాసనసభపక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికైన తర్వాత అన్నాడిఎంకెలో కీలకపరిణామాలు చోటు చేసుకొన్నాయి.

సినీ నటుడు అజిత్ ఎందుకు స్పందించడం లేదు

సినీ నటుడు అజిత్ ఎందుకు స్పందించడం లేదు

దివంగత జయలలితకు సినీ నటుడు అజిత్ అత్యంత ఆప్తుడుగా ఉన్నారు.ఆమె అజిత్ ను తన మానస పుత్రుడిగా చెప్పేవారనే ప్రచారం కూడ ఉంది.ఆసుపత్రిలో జయ ఉన్న సమయంలో ఆమెను పరామర్శించిన వారిలో తొలి వ్యక్తి అజిత్ .అయితే తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభ .పరిస్థితుల్లో అజిత్ నోరుమెదపడం లేదు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ విషయమై తమ గళాన్ని విప్పారు.అయితే అజిత్ మాత్రం నోరు మెదపడం లేదు. అజిత్ నోరు విప్పకపోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అజిత్ ఈ పరిస్థితుల్లో మాట్లాడం కంటే మౌనంగా ఉండడమే మేలని భావించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

 అమ్మకు అండగా నిలిచిన అజిత్

అమ్మకు అండగా నిలిచిన అజిత్

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ద్రవిడ పార్టీలదే ఆధిపత్యం కొనసాగుతోంది.జాతీయ పార్టీలు ద్రవిడ పార్టీల అండ లేనిదే మనుగడ సాగించడం కష్టంగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తమిళనాడులో సినిమా అవార్డుల ఫంక్షన్ లో పరోక్షంగా డిఎంకె చీఫ్ కరుణానిధిపై అజిత్ విమర్శలు గుప్పించారు. సినిమాల్లో రాజకీయాలను తీసుకురావద్దంటూ అజిత్ కరుణానిధిపై పరోక్ష విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలకు రజనీకాంత్ లాంటి సినీ నటుడు కూడ మద్దతు పలికారు.

అమ్మకు అండగా నిలిచిన అజిత్
అమ్మకు అండగా నిలిచిన అజిత్
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ద్రవిడ పార్టీలదే ఆధిపత్యం కొనసాగుతోంది.జాతీయ పార్టీలు ద్రవిడ పార్టీల అండ లేనిదే మనుగడ సాగించడం కష్టంగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తమిళనాడులో సినిమా అవార్డుల ఫంక్షన్ లో పరోక్షంగా డిఎంకె చీఫ్ కరుణానిధిపై అజిత్ విమర్శలు గుప్పించారు. సినిమాల్లో రాజకీయాలను తీసుకురావద్దంటూ అజిత్ కరుణానిధిపై పరోక్ష విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలకు రజనీకాంత్ లాంటి సినీ నటుడు కూడ మద్దతు పలికారు.

అజిత్‌ సిక్స్‌ప్యాక్ వెనుక జయలలిత

అజిత్‌ సిక్స్‌ప్యాక్ వెనుక జయలలిత

తమిళ సినీ నటుడు అజిత్ సిక్స్ ప్యాక్ కు సిద్దమయ్యాడు. వివేకం సినిమా లో ఆయన సిక్స్ ప్యాక్ తో తన అభిమానులకు కనువిందు చేయనున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్పూర్తితోనే అజిత్ జిమ్ కు వెళ్ళడం ప్రారంభించారని చెబుతారు.2015 లో వేదాలం సినిమా విడుదల సందర్భంగా అజిత్ ,జయలలితను కలిశారు.ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఆమె వాకబు చేశారట.ఆ సమయంలో జిమ్ కు వెళ్ళాలని సూచించడంతో ఆయన తిరిగి జిమ్ కు వెళ్ళడం ప్రారంభించాడు.తాజా సినిమా వివేకం లో ఆయన సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నారు.

పన్నీర్ కు మద్దతుగా నిలిచిన సినీ ప్రముఖులు

పన్నీర్ కు మద్దతుగా నిలిచిన సినీ ప్రముఖులు

తమిళనాడులో చోటుచేసుకొన్న పరిణామాల నేప,థ్యంలో సినీ నటులు పలువురు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మద్దతుగా ప్రకటించారు. అంతేకాదు పలువురు సినీ నటులు పన్నీర్ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. హీరోయిజాన్ని ప్రదర్శించారని పన్నీర్ ను అభినందించారు.ఇంత జరుగుతున్నా అజిత్ మాత్రం నోరు మెదపడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+