శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశం నిషేధం: సుప్రీం కోర్టు అభిప్రాయం!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ది చెందిన శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళలు ప్రవేశించాలా, వద్దా అనే విషయంపై పూర్తిగా విచారణ చేసి పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి సుప్రీం కోర్టులో ఐదుగురు న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 సంవత్సరాలపైన 50 సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళల ప్రవేశాన్ని నిషేధించారు. మహిళలను ఎందుకు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

Whether practice regulating entry women essential religious practice under article 25 Supreme Court

శుక్రవారం పిటిషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ విచారణకు ఐదుగురు న్యాయమూర్తులతో ప్రతేక బెంచ్ కు పిటిషన్ బదిలి చేసింది. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా నిర్ణయం తీసుకున్న ఆలయ కమిటి నిర్ణయం సరైనదా, కాదా అనే విషయం క్షుణ్ణంగా పరిశీలించ వలసిన అవసరం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అదే సమయంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా తీసుకున్న నిర్ణయం వారి హక్కులను అడ్డుకున్నట్లు అవుతుందా అనే విషయం పరిశీలించవలసి ఉందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. మహిళలు, పురుషుల పట్లు తారతమ్యం ఏందుకు చూపిస్తున్నారు అని విచారణ చెయ్యవలసి ఉందని, చెప్పింది. పిటిషన్ విచారణ చెయ్యడానికి ఐదు మంది న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A three-judge Bench of the Supreme Court today referred the case relating to entry of women in Sabarimala temple to a Constitution Bench.The supreme court raised some questions on this case. like wise Whether the practice of regulating entry of women is an essential religious practice under Article 25? Whether Sabarimala Ayyappa temple has a denominational character?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి