బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

temple: గుడికి వెలుతుంటే ?, బొలెరో 23 మంది భక్తులు, మృత్యువు రూపంలో మింగేసిన మర్రిచెట్టు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది మరణించారు. రామదుర్గ తాలూకా చుంచనూర్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మంది దుర్మరణం చెందారు. 10 మందికి తీవ్రగాయాలైనాయి.

Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్

బోలెరో పికప్ వాహనంలో 23 మంది ప్రయాణిస్తున్నారని వెలుగు చూసింది. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారని పోలీసులు చెప్పారు. మృతదేహాలను రామదుర్గ తాలూకా ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం బెళగావి జిల్లా ఎస్పీ డాక్టర్ సంజీవ్ పాటిల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

While going to the temple, a bolero pick-up vehicle lost control and six people died in Belagavi in Karnataka.

మనమవ్వ మగాడి (25), దీపా హరిజన్ (31), సవితా ముండాస్ (17), సుప్రీత హరిజన్ (11), యల్లప్ప బన్నూర (42), ఇంద్రవ్వ సిద్దమేత్రి (24) అనే ఆరు మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. వీరంతా హులకుంట గ్రామం నుంచి సవదత్తి యల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హులకుంట గ్రామం నుంచి సవదత్తి యల్లమ్మ ఆలయానికి కాలినడకన భక్తులు బయల్దేరారు. ఈ సమయంలో దారిలో గూడ్స్ వాహనంలో 23 మంది భక్తులు కూర్చున్నారు.

Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?

కటకోల సమీపంలో అర్థరాత్రి భక్తులు భోజనాలు చేసి సవదత్తికి వెళ్తుండగా గూడ్స్ వాహనం మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు, వారిని గోకాక్ సహా వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు కోలుకుంటున్నట్లు సమాచారం. మరణించిన ఆరుగురు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని బెళగావి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గోవింద కారజోల మీడియాకు చెప్పారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి గోవింద కారజోళ బాధితులకు హామీ ఇచ్చారు.

English summary
While going to the temple, a bolero pick-up vehicle lost control and six people died in Belagavi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X