రైళ్ల మీద పగ, ప్రతీకారం, ఏసీ బోగీలు, ఇంజన్ మీద దాడులు, వందే భారత్ తరువాత !

బెంగళూరు: భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి.

రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి ఘటన అనంతరం బసవ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్లదాడి జరిగిన ఘటన చోటుచేసుకుంది.కర్ణాటకలోని కలబురగి తాలూకా బాబాలాడి గ్రామం సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

attackingtrainswithstones
AC A1 బోగీ అద్దాలలను పగులగొట్టారు. ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇంజన్ బోగీపై కూడా రాళ్లు రువ్వారు. బసవ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ బాగల్‌కోట్- మైసూర్ మార్గం మధ్య నడుస్తుంది. రైలు కలబురగి-వాడి-యాదగిరి మార్గంలో నడుస్తుంది. దుండగులు రాళ్లదాడి చేసిన ఘటనను పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

వాడి రైల్వే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రైళ్ల మీద దాడులు చేస్తున్న నిందితులను పట్టుకోవడానికి రైల్వే పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రైళ్ల మీద దాడులు జరుగుతున్న ప్రాంతాల్లోని స్థానిక పోలీసుల సహాయం తీసుకుంటున్న రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే రైళ్ల మీద దాడులు చేస్తున్న వాళ్లు తప్పించుకోవడం, పదేపదే రైళ్ల మీద దాడులు జరగుతుండటంతో పోలీసులు ఎక్కువ నిఘా వేస్తున్నారు. రైళ్ల మీద దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పరిశీలించినా నిందితుల ఆచూకి చిక్కడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+