ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషి ఎవరు? ఏమన్నారంటే..?
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాద దాడికి బదులుగా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా "ఆపరేషన్ సింధూర్" చేపట్టాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపి సుమారు 30 మందిని హతమార్చారు. ఈ క్రమంలోనే దీనిపై నిర్వహించిన మీడియా సమావేశంలో భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ (ఇండియన్ ఆర్మీ) మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (ఎయిర్ ఫోర్స్) కలిసి మాట్లాడారు.
దీంతో కల్నల్ సోఫియా ఖురేషీ ఎవరా అంతా జోరుగా చర్చ జరుగుతోంది. ఆమె గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్ విభాగానికి చెందిన వారుగా చెబుతున్నారు. అలానే సోఫియా గుజరాత్‌కు చెందినవారు. ఆమె జీవరసాయన శాస్త్రంలో పీజీ చదివారు. సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ విభాగంలో అధికారిగా ఉండగా.. ఆమె తాత కూడా సైన్యంలో పనిచేశారు.

2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక గ్రూపులో ఆమె భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. అంతే కాకుండా సోఫియా ఖురేషీ ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల్లో ఆరు సంవత్సరాలు సేవలు అందించారు. ముఖ్యంగా 2006లో కాంగోలో జరిగిన మిషన్‌లో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఈ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. యుద్ధ భూముల్లో కాల్పుల విరమణను పర్యవేక్షించడం, అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడం గర్వంగా ఉందన్నారు. ఇక ఆమె గురించి సదర్న్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. ఆమె ఎంపిక కేవలం సామర్థ్యం, నాయకత్వం వల్లే జరిగిందని మెచ్చుకున్నారు.
మరోవైపు మీడియా సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి వాయుసేన ఎలా సహకరించిందో వివరించారు. ముఖ్యంగా ఏరియల్ సపోర్ట్, సర్వెయిలెన్స్, టార్గెట్ కోఆర్డినేషన్ వంటి అంశాలపై స్పష్టంగా వివరించారు. దీంతో ఇద్దరు మహిళా అధికారులు కీలక ఆపరేషన్ లో పాల్గొనడం పట్ల భారత సైన్యంలో మహిళల పాత్ర ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది. ఆడ, మగ లాంటి లింగ ప్రాధాన్యతకు కాకుండా సామర్థ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని భారత సైన్యం మరోసారి నిరూపించిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications