వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

bi0:డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేశ్ పాఠక్ నేపథ్యం.. అంచెలంచెలుగా ఎదిగి..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వరసగా రెండోసారి కొలువుదీరింది. 52 మంది మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే కీలక యూపీలో.. ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవీ వరించింది. వారిలో ఒకరు కేశ్ ప్రసాద్ మౌర్య.. ఆయన ఇదివరకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు. బ్రిజేష్ పాఠక్‌కు ఈ సారి ప్రమోషన్ లభించింది. ఇంతకీ వారి నేపథ్యం ఏంటో తెలుసుకుందాం.. పదండి.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..


ధానపతి దేవి, శ్యామ్‌లాల్ మౌర్య దంపతులకు 1969 మే 7వ తేదీన జన్మించారు. కౌశంబి జిల్లా వీరి స్వస్థలం కాగా..మౌర్య తండ్రి రైతు.. అతనికి సిరతు నగర్ వద్ద ఒక టీ షాప్ కూడా ఉండేది. మౌర్య తల్లి గృహిణి.. మౌర్యకు ఇద్దరు సుఖ్‌లాల్, రాజేంద్ర కుమార్ అనే ఇద్దరు సోదరులు.. సుమిత్రా దేవి, కమలేష్ కుమారి, ఆశాదేవి అనే ముగ్గురు సోదరిలు ఉన్నారు. 1985లో రాజ్‌కుమారి దేవిని మౌర్య వివాహం చేసుకున్నారు. వీరికి ఆశిష్ కుమార్ మౌర్య, యోగేశ్ కుమార్ మౌర్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

 విద్య

విద్య


సిరతు నగర్ హై స్కూల్‌లో పాఠశాల విద్య కొనసాగింది.సెకండరీ ఎడ్యుకేషన్ ఓసా స్కూల్‌లో సాగింది. తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేందుకు మౌర్య చిన్న తనంలో న్యూస్ పేపర్స్ అమ్మేవారు. తర్వాత ప్రయోగ్ రాజ్‌లో హిందీ లిటరేచర్ చేశారు. హిందీలో సాహిత్య సమ్మేళనంలో పూర్తి చేశారు.

ఆర్ఎస్ఎస్ నేపథ్యం..

ఆర్ఎస్ఎస్ నేపథ్యం..


1980లో ఆర్ఎస్ఎస్‌తో మౌర్యకు అనుబంధం ఏర్పడింది. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌తో కూడా మంచి రిలేషన్ షిప్ ఉండేది. గో సంరక్షణ, రామజన్మభూమి ఉద్యమాల్లో మౌర్య కీ రోల్ పోషించారు. 1990లో అయోధ్యలో మందిర నిర్మాణం కోసం కర్ సేవక్ బృందానికి నేతృత్వం వహించారు. 2012లో సిరతు నుంచి మౌర్య ఎమ్మెల్యే పదవీకి పోటీ చేశారు. 2014లో పుల్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2002, 2007, 2012లో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2016లో యూపీ బీజేపీ అధ్యక్ష పదవీ బాధ్యతలను చేపట్టారు. ఆ మరుసటి ఏడాది డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు మరోసారి పదవీని చేపట్టారు.

 ఇదీ పాఠక్ నేఫథ్యం

ఇదీ పాఠక్ నేఫథ్యం


ఇక బ్రిజేష్ పాఠక్ విషయానికి వస్తే.. లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇంతకుముందు న్యాయ, అెంబ్లీ, రూరల్ ఇంజినీంగ్ సర్వీస్ మంత్రిగా పనిచేశారు. తొలుతు న్యాయశాఖ పదవీ చేపట్టిన ఆయన.. తర్వాత పోర్టు పోలియో మారింది. పాఠక్.. న్యాయవాద వృత్తి ద్వారా కెరీర్ ప్రారంభించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ కన్నా ముందు బీఎస్పీలో పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు ఉన్నావ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2017లో అమిత్ షా నేతృత్వంలో బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పాఠక్ ప్రముఖ బ్రహ్మిణ్ నేత.. అంతకుముందు దినేశ్ శర్మ ఉండేవారు. అతని స్థానంలో యోగి ప్రభుత్వం పాఠక్‌కు డిప్యూటీ సీఎం పదవీని అప్పగించింది.

English summary
Keshav Prasad Maurya is member of the BJP who serves as the Deputy Chief Minister of Uttar Pradesh. He is also an MP from the Phulpur parliamentary constituency of Prayagraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X