వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికార ప్రతినిధి నుండి రక్షణమంత్రిగా, ఎవరీ నిర్మలా సీతారామన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు కేంద్ర మంత్రివర్గంలో మంచి ఫోర్ట్‌ఫోలియో దక్కింది. భారత రక్షణ మంత్రిత్వశాఖను మోడీ నిర్మలా సీతారామన్‌కు కట్టబెట్టారు. అయితే పార్టీకి చేసిన సేవలతో పాటు సహయమంత్రిగా నిర్మలా సీతారామన్‌కు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో ఆమెకు ప్రమోషన్ వచ్చింది. బిజెపి అధికార ప్రతినిధి నుండి రక్షణశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎదిగారు.

వాణిజ్య పన్నుల శాఖ సహయమంత్రిగా నిర్మలా సీతారామన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో మోడీ ఆమెకు రక్షణశాఖను అప్పగించారని బిజెపి నేతలు చెబుతున్నారు.

ఇందిరాగాంధీ తర్వాత నిర్మలా సీతారామన్‌కు, తెలుగింటి కోడలుకు ప్రమోషన్ ఇందిరాగాంధీ తర్వాత నిర్మలా సీతారామన్‌కు, తెలుగింటి కోడలుకు ప్రమోషన్

మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత మోడీ నలుగురు మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. సహయ మంత్రుల నుండి కేబినెట్ మంత్రులుగా బాధ్యతలుగా బాధ్యతలను చేపట్టిన నిర్మలా సీతారామన్ సహ మరో ముగ్గురు మంత్రులను మోడీ అభినందించారు.

ఇందిరాగాంధీ తర్వాత రక్షణశాఖను చేపట్టిన మహిళగా నిర్మలా సీతారామన్‌ చరిత్ర సృష్టించారు.బిజెపిలో ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అయితే పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిర్మలా సీతారామన్ సక్రమంగా నిర్వహించారు.

ఎవరీ నిర్మలా సీతారామన్

ఎవరీ నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్‌ ఆగస్టు 18, 1950 తమిళనాడులోని మధురైలో నారాయణ సీతారామన్‌, సావిత్రి దంపతులకు జన్మించారు. తిరుచురాపల్లిలోని సీతాలక్ష్మిరామస్వామి కళాశాల నుంచి బీఏ పూర్తిచేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా అందుకున్నారు. ఇండో-యూరోపియన్‌ వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనకు పీహెచ్‌డీ, తర్వాత ఎంఫిల్‌ పట్టా అందుకున్నారు. ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ అనే సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా, బీబీసీ వరల్డ్‌లోనూ ఆమె సేవలందించారు. హైదరాబాద్‌లో ప్రణవ స్కూల్స్‌ వ్యవస్థాపకుల్లో నిర్మల ఒకరు. గతంలో ఆమె జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగానూ సేవలందించారు.

2006లో బిజెపిలో చేరిన నిర్మలా సీతారామన్

2006లో బిజెపిలో చేరిన నిర్మలా సీతారామన్

2006లో నిర్మలా సీతారామన్ బిజెపిలో చేరారు. బిజెపిలో ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ 2007లో బిజెపిని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయినా నిర్మలా సీతారామన్ బిజెపిలోనే కొనసాగారు. నితిన్‌ గడ్కరీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సమయంలో పార్టీ నియమించిన ఆరుగురు ప్రతినిధుల బృందంలో ఒకరిగా నిర్మలా సీతారామన్‌ ఉన్నారు.

క్రమశిక్షణతో బాద్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్

క్రమశిక్షణతో బాద్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్

పార్టీ ఇచ్చిన ప్రతి పనిని నిర్మలా సీతారామన్ అత్యంత నిబద్దతతో పూర్తిచేశారు. క్రమశిక్షణతో మెలిగారు. దీంతో పార్టీలో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన భారతీయ జనతాపార్టీ ప్రత్యేక ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆమె పార్టీలోని తన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకొన్నారు.

బిజెపి విధానాలపై విస్తృత ప్రచారం

బిజెపి విధానాలపై విస్తృత ప్రచారం

భాజపా అధికార ప్రతినిధిగా 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వాణిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో కీలక భూమిక పోషించారు. తర్వాత కాలంలోభాజపా అధికారంలోకి రావడంతో నిర్మలాసీతారామన్‌ మే26, 2016న అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని వాణిజ్య, పరిశ్రమల శాఖ (స్వతంత్ర)మంత్రిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.జూన్‌ 11, 2016న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి కర్ణాటక రాష్ట్రం నుంచి ఎంపీగా గెలుపొందారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణలో కీలకమైన రక్షణమంత్రి పదవిని దక్కించుకున్నారు.

English summary
Nirmala Sitharaman has been chosen as India’s new Defence Minister. Promoted today, Formerly a member of the National Commission for Women, Sitharaman has an MA degree in economics from Jawaharlal Nehru University. She also has a PhD in the Indo-European textile trade within the GATT framework and MPhil.She had joined the BJP in 2006 even though her husband Dr Parakala Prabhakar had joined the Prajarajyam party floated by film star Chiranjeevi in 2007.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X