ఎవరీ బంగారు నిధి స్వామి?: అఖిలేష్‌పై ముందే జోస్యం

శోభన్ ఆశ్రమం కాన్పూర్‌కు ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలోని శోభన్ గ్రామం ప్రాంతంలో ఉంది. అక్కడ రామ, హనుమాన్ మందిరాలు ఉన్నాయి. భక్తులు ఇతనిని స్వామీజి, సర్కార్, భగవాన్ అని పిలుస్తుంటారు.
సాధువు శోభన సర్కార్ కాన్పూర్‌నగర్ జిల్లాలోని మంధనపట్నంలో బిపిఎంజీ ఇంటర్ కాలేజ్‌లో విద్యాభ్యాసం చేశారు. చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక భావాల వైపు ఆకర్షితుడైన ఆయన చదువుకునే రోజుల్లోనే శ్రద్ధగా గీతాపఠనం, రామ్‌చరిత మానస్ అధ్యయనం చేసేవారని స్థానికులు చెబుతున్నారు.
హైస్కూల్ చదువు పూర్తయ్యాక ఇల్లు వదిలి వెళ్లిపోయి స్వామి సత్సంగానంద్ వద్ద శిష్యరికం చేశారు. ఆయనను అందరూ 'బడేస్వామి'గా వ్యవహరించేవారు. ఎనిమిదేళ్లపాటు బడేస్వామి వద్ద శిష్యుడిగా ఉన్న శోభన్ సర్కార్ తర్వాత సొంతంగా ఆశ్రమం నిర్మించుకున్నారు. దానికి అనుబంధంగా ఉన్న గ్రామాలన్నిటికీ రోడ్లను నిర్మించారు.
పలు గ్రామాల్లో దేవాలయాలు నిర్మించి ధర్మ ప్రచారం చేశారు. ప్రస్తుతం శోభన్ సర్కార్‌కు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు ఆశ్రమాలున్నాయి. మీడియా ముందుకు రావడానికి ఆయన ఇష్టపడరంట. ఇన్నాళ్లుగా ఆయన తరఫున శిష్యుడు ఓంజీ మాత్రమే మీడియాకు వివరాలు అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications