Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దశాబ్దాల పాటు రామయ్య సేవ: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు ఎలా అయ్యారు- రూ.100 వేతనం

Acharya Satyendra Das: అయోధ్యలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రనాథ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ న్యురాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు.

మాఘ పౌర్ణమి నాడే..

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆసుపత్రి డాక్టర్లు అధికారికంగా ధృవీకరించారు. గుండెపోటు వల్ల మరణించినట్లు ఆయన ప్రధాన శిష్యుడు ప్రదీప్ దాస్ తెలిపారు. పంచాంగం ప్రకారం- అత్యంత పవిత్రమైన రోజుగా భావించే మాఘ పౌర్ణమి నాడు ఆచార్య సత్యేంద్రనాథ్ దాస్ శివైక్యం అయ్యారు.

Who was Acharya Satyendra Das How he became a Ayodhya Ram Mandir s chief priest

యోగి దిగ్భ్రాంతి..

ఆయన మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపాన్ని తెలియజేశారు. ఆయనను కారణజన్ముడిగా అభివర్ణించారు. శ్రీరామ కార్యార్థం ఈ భూమిపైకి వచ్చారని, రామమందిరం నిర్మాణం ఆయన చేతుల మీదుగా జరగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.

తీవ్ర అనారోగ్యం..

వృద్ధ్యాప్యం వల్ల సంభవించిన అనారోగ్య కారణాలతో ఈ నెల 3వ తేదీన ఆచార్య సత్యేంద్రనాథ్ దాస్ లక్నో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తొలి రెండు రోజుల పాటు ఆరోగ్యం విషమంగానే కనిపించింది. దీనితో న్యూరాలజీ విభాగానికి తరలించారు. అత్యాధునిక వైద్య చికిత్సను అందజేశారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించారు.

అనూహ్యంగా గుండెపోటు..

దీనితో సత్యేంద్రనాథ్ దాస్ ఆరోగ్యం కొంత నిలకడగా కనిపించింది. అదే సమయంలో అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు. ఈ ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త దావానలంలా మారింది. జనం దిగ్భ్రాంతికి గురయ్యారు. అయోధ్యానగరి మూగబోయింది. ఎక్కడికక్కడ ఆయన ఫొటోలకు దండలు వేసి, నివాళి అర్పిస్తోన్నారు ఉత్తరప్రదేశ్‌వాసులు.

రేపు అంత్యక్రియలు..

సత్యేంద్రనాథ్ దాస్ పార్థివ దేహాన్ని ఈ సాయంత్రం లక్నో నుంచి అయోధ్యకు తరలించనున్నారు. గురువారం ఉదయం అయోధ్య మీదుగా ప్రవహిస్తోన్న చారిత్రాత్మక సరయూ నది ఒడ్డున అంత్యక్రియలను నిర్వహించనున్నారు. యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు రాష్ట్ర, కేంద్రమంత్రులు అంతమయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.

Who was Acharya Satyendra Das How he became a Ayodhya Ram Mandir s chief priest

33 సంవత్సరాలుగా..

సుదీర్ఘకాలంగా శ్రీరామ జన్మభూమి- బాబ్రీ మసీదు ఉద్యమంలో కొనసాగుతూ వచ్చారు ఆచార్య సత్యేంద్రనాథ్ దాస్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 1992 నుంచీ రామజన్మభూమితో మమేకం అయ్యారు. అప్పట్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చయంత్ రాయ్ సహా రామ మందిర ఉద్యమంతో ముడిపడి ఉన్న వాళ్లతో తన ప్రయాణాన్ని సాగించారు. అప్పటి నుంచీ ఆలయ ప్రధాన పూజారిగా ఉంటూ వచ్చారు.

రామమందిరంలోనూ..

అయోధ్య రామమందిరానికీ ప్రధాన అర్చకుడిగా ఉంటూ వచ్చారాయన. రామ మందిర నిర్మాణంలో అడుగడుగునా ఆయన ముద్ర కనిపిస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఆయోధ్య రామమందిరంపై 2005 జులై 5వ తేదీన ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలోనూ ఆయన తట్టుకుని నిలిచారు. రామ్ లల్లా సేవలను విస్మరించలేదు. బాల రాముడికి నిత్య కైంకర్యాలను సమర్పించారు.

రూ. 100 వేతనం..

1992 కంటే ముందు రామమందిరం ప్రధాన అర్చకుడిగా లాల్ దాస్ కొనసాగారు. ఆయన తరువాత వారసుడిగా సత్యేంద్రనాథ్ దాస్ ఎంపికయ్యారు. విశ్వహిందూ పరిషత్ ఆయన నియామకంలో కీలకంగా వ్యవహరించింది. అప్పటి అధ్యక్షుడు అశోక్ సింఘాల్ స్వయానా దాస్‌ను ఎంపిక చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిని సహాయకులుగా నియమించారు. అప్పట్లో ఆయన వేతనం 100 రూపాయలే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+