ఉత్కంఠకు తెర: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్, వెంకయ్యదే కీలక పాత్ర

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు యోగీ ఆదిత్యనాథ్ ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలకు అవకాశం కల్పించారు.

కాగా, యోగి ఆదిత్యనాథ్ ఆదివారంనాడు యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం  గోరఖ్‌పూర్ నుంచి పార్లమెంటుసభ్యుడిగా కొనసాగుతున్నారు ఆదిత్యానాథ్. ఐదుసార్లు ఎంపీగా ఆయన గెలుపొందారు. బీజేపీలో ఆదిత్యనాథ్ కు ఫైర్ బ్రాండ్ ముద్ర ఉంది. సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థుల మధ్య తీవ్రంగా ఉండటంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ కీలక నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఆదిత్యనాథ్ ఎంపికలో వెంకయ్యదే కీలక పాత్ర అని తెలుస్తోంది.

Who will be next UP CM? Catch the action Live here

అంతకుముందు, ముఖ్యమంత్రి బరిలో ఉన్న బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్లమెంటు సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ వర్గీయులు తమ వారిని సీఎంగా నియమించాలంటూ ఇప్పటికే నిరసనలు చేపట్టారు. కేంద్రమంత్రి మనోజ్ సిన్హా ఇప్పటికే సీఎం పదవి చేపట్టేందుకు విముఖత చూపిన విషయం తెలిసిందే.

యూపీకి ఏపీ సీఎం చంద్రబాబు

ఆదివారం యూపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లక్నోకు బయల్దేరి వెళ్లనున్నారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందడంతో ఆదివారం మధ్యాహ్నం 12.45గంటలకు చంద్రబాబు లక్నో చేరుకోనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is palpable tension outside the BJP's office in Lucknow where the legislator's party meet is being held. Demonstrations were held by the Keshav Prasad Maurya and Yogi Adityanath camps demanding that their leader be made the chief minister.
Please Wait while comments are loading...