బీహార్ సీఎం పదవిపై బీజేపీ కొత్త ఫార్ములా, నితీశ్ సిద్దమేనా- కీలక మలుపు..!!
బీహార్ లో ఎన్డీఏ భారీ విజయం సాధించింది. అంచనాలకు మించి సీట్లు గెలుచుకుంది. మరో సారి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగనుంది. అయితే, ఈ సారి ముఖ్యమంత్రి ఎవరు. నితీశ్ కొనసాగుతారా, లేక బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రి వస్తారా అనేది ఉత్కంఠగా మారుతోంది. ఇదే సమయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. 2029 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు బీహార్ కొత్త ప్రభుత్వం లో బీజేపీ మార్క్ ఫార్ములా అమలు దిశగా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి.
బిహార్ గడ్డపై మళ్లీ అధికార ఎన్‌డీఏ కూటమే గెలిచింది. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానా లు ఉన్నాయి. అత్యధికంగా 90 స్థానాల్లో గెలుపుతో అతిపెద్ద రాజకీయ పక్షంగా బీజేపీ అవతరిం చింది. 85 సీట్లలో గెలుపుతో జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఫలితాల ప్రాతిపదికన సీఎం పదవిని బీజేపీ ఆశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న చర్చలు ఆసక్తిగా మారుతు న్నాయి. బీజేపీ ఇతే ప్రతిపాదనతో ముందుకు వస్తే నీతీశ్ ఎలా స్పందిస్తారు అనే దాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఒకవేళ విపక్ష మహా కూటమిలో నీతీశ్ (జేడీయూ) చేరినా 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడం కష్టతరం అవుతుంది. జేడీయూ 85 సీట్లు, ఆర్‌జేడీ 25 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, వామపక్షాల 2 సీట్లను కలుపుకున్నా 117 సీట్లే అవుతాయి. దీంతో, బీజేపీ తమ పట్టు బిగించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది.

అయితే, కేంద్రంలోనూ జేడీయూ ఇప్పుడు కీలకంగా ఉంది. ఈ సమయంలో బీజేపీ నితీశ్ ను కాదనే సాహసం చేయదనే అభిప్రాయమూ బలంగా వినిపిస్తోంది. బీజేపీ (90) చేయాలనుకుంటే 19 సీట్లు సాధించిన ఎల్‌జేపీ, 5 సీట్లు గెల్చిన హెచ్ఏఎం, 4 సీట్లు పొందిన ఆర్ఎల్‌ఎంలతో పాటు మరిన్ని చిన్న పార్టీలనూ ఎన్‌డీఏ కూటమిలోకి చేర్చుకొని మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుందా అనేదే స్పష్టత రావాల్సి ఉంది. నితీశ్ కు సీఎం పదవి ఇవ్వకుంటే తిరిగి ఆయన కాంగ్రెస్ కూటమి వైపు చూసే ఛాన్స్ ఉంది. ఆ కూటమి బలం పెంచే విధంగా బీజేపీ వ్యవహరించదని భావిస్తున్నారు. 2027 లో జరిగే రాష్ట్రపతి ఎన్నిక తో పాటుగా 2029 పార్లమెంట్ ఎన్నికలకు బీహార్ కీలకంగా మారనుంది. దీంతో.. నితీశ్ ను కాదని కొత్త సమస్యల కంటే.. నితీశ్ ను కొనసాగించే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఒక వేళ బీజేపీ సీఎం సీటు ఆశిస్తే.. భవిష్యత్ లో ఉన్నత పదవి పైన హామీ ఇస్తూనే... నితీశ్ ను ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో కీలక శాఖ అప్పగిస్తారనే ప్రచారమూ ఉంది. అటు ఎల్‌జేపీ అధినేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ సైతం తాజా ఎన్నికలతో బలమైన నేతగా ఎదిగారు. కొత్త ప్రభుత్వం లో చిరాగ్ ఎక్కువ మంత్రి పదవుల కోసం డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ సీఎంలు (సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా) కూడా బీజేపీ నేతలే. రాబోయే ప్రభుత్వంలో కూడా నీతీశ్ సీఎం అయితే బీజేపీ నుంచి డిప్యూటీలు ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచినందున రాబోయే ప్రభుత్వంలో తమ పార్టీకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని చిరాగ్ పాశ్వాన్ పార్టీకి దక్కనుంది. ఎలాంటి ట్విస్టులు లేకపోతే.. వచ్చే వారం నితీశ్ మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
-
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..!












Click it and Unblock the Notifications