ట్వీస్ట్: ప్రేమ, పెళ్లి, జైలు, తల్లి వ్యతిరేకం: అందుకే చెన్నై విద్యార్థిని అశ్విని ప్రాణాలు తీశాడు
చెన్నై: చెన్నైలో మినరల్ వాటర్ వ్యాపారం చేస్తున్న అళగేశన్ బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విని(19) ప్రాణం తీసిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అశ్విని తనను ప్రేమించి మోసం చేసిందని, ఆమె తల్లి పెళ్లికి వ్యతిరేకించిదని, జైల్లో పెట్టించారని, అందుకే ప్రాణాలతో లేకుండా చేసినట్లు అళగేశన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.
తండ్రి చనిపోయాడు
తండ్రి చనిపోవడంతో అశ్విని తల్లి శంకరితో కలిసి నివాసం ఉంటోంది. అదే సమయంలో ఇంటికి మినరల్ వాటర్ సరఫరా చేసే అళగేశన్‌తో అశ్వినికి పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారని తెలిసింది. కొంత కాలం సినిమాలకు, షికార్లకు వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అశ్విని తల్లి, బంధువులు
అయితే అశ్వినీ అళగేశన్ ను పెళ్లి చేసుకొవడానికి ఆమె తల్లి శంకరి, బంధువులు అంగీకరించలేదు. అశ్వినీ, అళగేశన్ గతంలో ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఇక్కడ ఉంటే అళగేశన్ అశ్వినీతో మరింత దగ్గర అవుతాడని ఆమె తల్లి, బంధువులు ఆందోళన చెందారు.
మకాం మార్చిన శంకరి
అశ్విని తల్లి శంకరి బంధువుల సహాయంతో ఇంటిని మధురవాయల్ ప్రాంతానికి మార్చారు. అయితే అళగేశన్ అక్కడికి వెళ్లి అశ్వినిని కలవడం మొదలు పెట్టాడు. అశ్వినితో మాట్లాడకూడదని ఆమె తల్లి శంకరి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
ఇంటిలో తాళి కట్టాడు
కొంత కాలం క్రితం అళగేశన్ ఇంటిలో చొరబడి అశ్వినికి తాళికట్టాడు. అశ్వని పెద్దనాన్న సంపత్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆ సమయంలో తనకు అళగేశన్‌కు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల సమక్షంలో అశ్విని లేఖ రాసి ఇచ్చింది.
జైలుకు అళగేశన్
ఇష్టంలేని అమ్మాయికి బలవంతంగా తాళి కట్టాడని, ఇంటిలోకి చొరబడ్డాడని కేసు నమోదు చేసిన పోలీసులు అళగేశన్ ను జైలుకు పంపించారు. ఇటీవల అళగేశన్ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ అశ్వినీ వెంటపడ్డాడు.
కాలేజ్ నిలిపేశారు
అళగేశన్ వేధింపులు ఎక్కవ కావడంతో రెండు వారాల నుంచి అశ్విని కాలేజీకి వెళ్లలేదు. గురువారం నుంచి అశ్విని కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టింది. గురువారం అశ్విని కాలేజీకి వచ్చిందని అళగేశన్‌కు సమాచారం అందింది.
వెంటాడి చెంపేశాడు
శుక్రవారం అశ్వినీ కాలేజ్ కు వచ్చిందని తెలుసుకున్న అళగేశన్ కత్తి తీసుకుని కేకే నగర్ లోని మీనాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరకు వెళ్లాడు. కాలేజ్ లో నుంచి బయటకు వచ్చిన అశ్వినీని పట్టుకున్న అళగేశన్ ఇష్టం వచ్చినట్లు కత్తితో దాడి చేసి గొంతుకోసి చంపేశాడు. స్థానికుల దాడిలో తీవ్రగాయాలైన అళగేశన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications