వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారస్వామి ఎఫెక్ట్: 2019లో దెబ్బ.. కాంగ్రెస్‌లో కొందరి భయం అదే, యడ్డీ బలం ఆ 'రెండు' కారణాలే

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆయనచే ప్రమాణం చేయించారు. జేడీఎస్ మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. అదే విశ్వాసంతో యెడ్డీ ప్రమాణ స్వీకారం చేశారు.

Recommended Video

BJP offered Rs. 100 Crores Says Kumaraswamy

సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఈ ఎన్నికల్లోను ఎక్కువమంది లింగాయత్‌లో బీజేపీకే ఓటు వేశారు. హిందూ సమాజాన్ని విడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు గుర్తించారని అంటున్నారు.

గుజరాత్ దెబ్బ కర్ణాటకలో పడింది: దేవేగౌడకు బీజేపీ టిట్ ఫర్ టాట్గుజరాత్ దెబ్బ కర్ణాటకలో పడింది: దేవేగౌడకు బీజేపీ టిట్ ఫర్ టాట్

చాముండేశ్వరిలో సిద్ధరామయ్య ఏకంగా 36వేల ఓట్లతో ఓడిపోయారు. ప్రముఖ వొక్కలింగ నేత జీటీ దేవేగౌడ చేతిలో ఓడిపోయారు. ధార్వాడ్ రూరల్ నుంచి వినయ్ కులకర్ణి, శరణ్ ప్రకాశ్ పాటిల్, బస్వరాజు రాయరెడ్డి తదితరులు కూడా ఓడిపోయారు. ఆ చోట్ల బీజేపీ నెగ్గింది.

కాంగ్రెస్ లింగాయత్ ఎమ్మెల్యేల అసంతృప్తి

కాంగ్రెస్ లింగాయత్ ఎమ్మెల్యేల అసంతృప్తి

ఈ నేపథ్యంలో లింగాయత్‌ల విభజన, జేడీఎస్ అధినేత కుమారస్వామి సీఎం అయ్యేందుకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిర్ణయించుకోవడాన్ని పలువురు లింగాయత్ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ప్రత్యేక మతం కారణంగానే అసంతృప్తితో ఉన్న కొందరు, ఇప్పుడు జేడీఎస్‌కు మద్దతు ఇవ్వడం అసలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

ఓట్లు కోల్పోతాం

ఓట్లు కోల్పోతాం

వొక్కలింగ కుమారస్వామికి మద్దతిస్తే లింగాయత్ ఓట్లు కోల్పోతామని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. ఆనంద్ సింగ్, రాజేశ్వర్ పాటిల్, నాగేంద్ర, ఎంవై పాటిల్ తదితరులు కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం పట్ల ఏమాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది. ఇలాగే ముందుకు వెళ్తే 2019లో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందని ఆ పార్టీ లింగాయత్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 17 శాతం ఉన్న లింగాయత్‌ల ప్రాబల్యం పలు నియోజకవర్గాల్లో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లలో లింగాయత్‌ల ప్రభావం 90 నుంచి వంద సీట్ల వరకు ఉంటుంది.

ఈ లెక్కనే చెబుతోంది

ఈ లెక్కనే చెబుతోంది

లింగాయత్‌లకు ప్రత్యేక మతం అనేదానిని ఆ సామాజిక వర్గం కూడా జీర్ణించుకోవడం లేదనే విషయం ఎన్నికల ఫలితాల సరళిను చూస్తే తెలుస్తుందని అంటున్నారు. ముంబై కర్ణాటకలో వారి ప్రాభవం ఎక్కువ. అక్కడ 2013లో 31 సీట్లు గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు 17 సీట్లకు పడిపోయింది. లింగాయత్‌లకు ప్రత్యేక మతం అనే అంశం పార్టీ తప్పుడు నిర్ణయమని సొంత పార్టీ నేత వీరప్ప మొయిలీ కూడా అభిప్రాయపడ్డారు. కుల సమీకరణాల పరంగా పార్టీ నిర్ణయం సరికాదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ లింగాయత్ అసంతృప్తి

కాంగ్రెస్ లింగాయత్ అసంతృప్తి

ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు కొందరు మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే పార్టీ మాత్రం దానిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేసిందని అంటున్నారు. లింగాయత్ విభజనతో వచ్చేదేమీ లేదని, కేవలం హిందూ వర్గాన్ని విడదీయడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోందని ఎక్కువ మంది లింగాయత్‌లు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.

 2019లో దెబ్బ

2019లో దెబ్బ

లింగాయత్‌కు ప్రత్యేక మతం, దానికి తోడు జేడీఎస్‌తో దోస్తీ.. ఈ రెండు అంశాలను లింగాయత్ వర్గం ఎమ్మెల్యేలు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదట. 2019 లోకసభ ఎన్నికల్లో ఈ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ - జేడీఎస్‌ల కలయిక తమ పార్టీకి లింగాయత్‌లను మరింత దూరం చేస్తుందని కాంగ్రెస్ లింగాయత్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు యడ్యూరప్ప లింగాయత్ లీడర్ కావడం కూడా కలిసి వచ్చిందని అంటున్నారు.

English summary
What was supposed to be a master-stroke turned out to be doom for the Congress in Karnataka. The much hyped Lingayat issue failed to give the Congress any dividends and that was clear in the results that were declared on Tuesday. The Congress tally dropped from 121 to 78 and the BJP emerged as the single largest party with 104 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X