Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ద్రవ్యోల్బణం బీజేపీని మూడు రాష్ట్రాల్లో ఓడించింది...ఏంటి నమ్మకం లేదా..?

వినియోగదారు ధర సూచిక కింద వచ్చే రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 2.33 శాతం క్షీణించింది. అంటే దీంతో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు వినియోగించేంత డబ్బుగా చూడొచ్చు. ఇప్పటి వరకు క్షీణించిన ద్రవ్యోల్బణంతో చాలా ప్రభుత్వాలే పడిపోయిన ఘటనలు చరిత్రలో చూశాం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ద్రవ్యోల్బణం కారణంగా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. గ్రామీణ ఆదాయంలో ద్రవ్యోల్బణం క్షీణించడంతో ఆ రాష్ట్రాలు ఓటమి పాలయ్యాయి.

ఆహార ఉత్పత్తులపై ద్రవ్యోల్బణం క్షీణించడంతో ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. నవంబర్‌లో వరుసగా రెండో సారి ఆహార ఉత్పత్తుల ధరలు పడిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం క్షీణించినట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవటంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ప్రభుత్వంతో తమకు ఒరిగేది ఏది లేదని భావించిన రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు భావిస్తున్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించక పోవడం... పైగా అధికారంలోకి వస్తే రుణమాఫీలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో అక్కడి ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని రాజకీయ విశ్లేషకులు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో ప్రజలు హస్తం పార్టీ వైపు చూశారని చెప్పారు.

Why did BJP lose Assembly Elections 2018? Retail inflation has answers

2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ విషయాన్ని అధికార బీజేపీ గ్రహించకపోతే రాష్ట్రాల్లో రిపీట్ అయిన ఫలితాలే రేపు పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతమవుతాయని జోస్యం చెబుతున్నారు నిపుణులు.రిటైల్ ద్రవ్యోల్బణంను నియంత్రించేందుకు ఒక ఆర్థికపరమైన విధానాలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేసేందుకు ఏమీ ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో కన్నా రైతులు చాలా తక్కువగా తమ పంటపై సంపాదిస్తున్నారని చెబుతున్నారు. అయితే వారు పంటపై రుణాలు తీసుకోవడం మాత్రం ఆపడం లేదు. నష్టాలు చవిచూస్తున్నప్పటికీ రుణాలు పొంది మళ్లీ పంట పండిస్తున్నారు. అయితే వడ్డీ రేటు కూడా పెరిగిపోతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్‌కు పట్టం కట్టారని నిపుణులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+