వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తవాంగ్‌ సెక్టార్‌లో భారత్, చైనా సైనికులకు ఘర్షణ ఎందుకు జరిగిందంటే..!

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఈ సరిహద్దు వివాదాలు ఒక్కోసారి ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దారితీస్తున్నాయి. 2020లో తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అసువులు భాసారు. చైనా సైనికులు కూడా మరణించారు. కానీ ఆ దేశం ఎంత మంది చనిపోయారో తెలపలేదు.

డిసెంబర్ 9న

డిసెంబర్ 9న


తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల నడుమ డిసెంబర్ 9న ఘర్షణ చెలరేగింది. అస్సలు ఈ ఘర్షణ ఎందుకు జరిగిందంటే.. భారత్‌, చైనాకు మధ్య 3,488 కి.మీ. మేర పొడవైన సరిహద్దు ఉంది. జమ్మూకశ్మీర్‌తో మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింల మీదుగా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ సరిహద్దు ఉంది. రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు ఇప్పటి వరకు లేవు.

అక్సాయ్ చిన్‌

అక్సాయ్ చిన్‌

దీంతో అక్సాయ్ చిన్‌ను తమ పశ్చిమ సెక్టార్‌లోని ప్రాంతంగా భారత్ చెబుతోంది. కానీ, ప్రస్తుతం ఈ ప్రాంతం తమ నియంత్రణలో ఉందని చైనా వారిస్తుంది. తాజాగా చైనా దళాలు ఈ ప్రాంతంలోకి చొచ్చుకు రావడంతో భారత బలగాలు ప్రతిఘటించాయి. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను సైన్యం విడుదల చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించారు.
వైమానిక దళ వర్గాలు

వైమానిక దళ వర్గాలు

సరిహద్దులో ఉద్రిక్తలు నెలకొడంతో గనతల పెట్రోలింగ్‌ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు చెప్పాయి. కాగా తవాంగ్ ఘటనపై అమెరికా స్పందించింది. భారత్-చైనా సరిహద్దు ఘర్షణను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని వైట్‌హౌస్ పేర్గొంది.యుఎస్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని వివాదాస్పద సరిహద్దులను చర్చించడానికి ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఛానెల్‌లను ఉపయోగించుకోమని ఇరుపక్షాలను తాము
కోరుతున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు.

బోర్డర్ మేనేజ్‌మెంట్ కమిటీ

బోర్డర్ మేనేజ్‌మెంట్ కమిటీ


ఇరు దేశాలు సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం బోర్డర్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేశారు. సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించేందుకు ఈ కమిటీలు పనిచేస్తున్నాయి.

English summary
A clash broke out between Indian and Chinese soldiers in the Tawang sector of Arunachal Pradesh on December 9. Why did this clash happen?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X