వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే పెళ్లి చేసుకోలేదట...సుప్రీంకోర్టుకు తెలిపిన మాయావతి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: యూపీ మాజీముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిపై నమోదైన అవినీతి కేసులు ఆమెను ఎన్నికల వేళ వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే తాను 2009లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె విగ్రహాల ఏర్పాటుకు, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. దీనినై సుప్రీంకోర్టుకు ఓ లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు మాయావతి.

మాయావతిని వెంటాడుతున్న విగ్రహాల కేసు

మాయావతిని వెంటాడుతున్న విగ్రహాల కేసు

2009లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె విగ్రహాల ఏర్పాటు కోసం దాదాపు రూ.2వేల కోట్లు కేటాయించారని చెబుతూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే మాయావతి ఓ అఫిడవిట్‌ను సర్వాన్నత న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఇందులో ఆమె పలు విషయాలను వెల్లడించారు. తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేసినట్లు చెప్పిన మాయావతి సమాజంలో వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం కృషి చేసినట్లు తెలిపారు.ప్రజలకోసమే పాటు పడాలనే తపనతో తాను వివాహం కూడా చేసుకోలేదని మాయావతి పేర్కొన్నారు.

ఇందుకే పెళ్లి కూడా చేసుకోలేదు

ఇందుకే పెళ్లి కూడా చేసుకోలేదు

మాయావతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఫిబ్రవరి 8న ఆదేశించింది. అంతేకాదు విగ్రహాల ఏర్పాటు కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని వెంటనే ప్రభుత్వ ఖాతలో జమచేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపై వివరణ ఇచ్చిన బెహన్‌జీ ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసిన తాను వివాహం కూడా చేసుకోలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే విగ్రహాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె విగ్రహాలను ఏర్నాటు చేయడం ద్వారా దళిత మహిళల అభ్యున్నతికి తాను తన జీవితాన్ని త్యాగం చేసినట్లు చెప్పేందుకే అని ఆమె వివరించారు.

70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు..ఐదేళ్లలో నేను ఎలా చేయగలను: మోడీ70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు..ఐదేళ్లలో నేను ఎలా చేయగలను: మోడీ

అన్నీ అవాస్తవాలే..కేసు కొట్టేయండి

అన్నీ అవాస్తవాలే..కేసు కొట్టేయండి

ఇక తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని వెంటనే కేసును కొట్టివేయాలని మాయావతి కోర్టును అభ్యర్థించారు. తనపై కేసు రాజకీయ కోణంలో వేసిందే అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం తప్పులేదని చెప్పిన మాయావతి తన విగ్రహాలు, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు బడ్జెట్ కేటాయించామని అది అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాకే నిధులు వినియోగించినట్లు ఆమె పేర్కొన్నారు.

English summary
Bahujan Samaj Party chief Mayawati penned an emotional letter to the Supreme Court on Tuesday (April 2) on why life-size statues of her as well as the party symbol, elephant, at various places in Uttar Pradesh during her tenure as UP chief minister.She wrote that in her service of the people she had even "remained unmarried".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X