MP: రోడ్లు, తాగునీరు చిన్నచిన్న విషయాలు, మన లక్షం లవ్ జీహాద్, ఎంపీ సలహా !
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో లవ్ జీహాద్ ను కట్టడి చెయ్యడానికి ప్రత్యేక చట్టాలు తీసుకు వచ్చాయి. కర్ణాటకలో కూడా లవ్ జీహాద్ ను కట్టడి చెయ్యడానికి, మతమార్పిడిని అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్న కర్ణాటక బీజేపీ చీఫ్ తాగునీరు. రోడ్లు తదితర వియం చాలా చిన్నచిన్న సమస్యలు అని చెప్పడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు, తాగునీటి సమస్య, మరుగుదోడ్లు లాంటి చిన్న చిన్న సమస్యల గురించి ఆలోచించే బదులు లవ్ జిహాద్‌పై పోరాడాలని తమ పార్టీ కార్యకర్తలకు బీజేపీ కర్ణాటక చీఫ్ నళిన్ కుమార్ కటీల్ సూచించారు.
ఇదే సంవత్సరం చివర్లో కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటకలో పార్టీ సమావేశంలో బీజేపీ కర్ణాటక చీఫ్, ఆ పార్టీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోడ్డు, తాగుమురుగునీటి వంటి చిన్న చిన్న సమస్యల గురించి మనం మాట్లాడం దండగ, మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే, మీరు లవ్ జిహాద్ ని అడ్డుకోవాలని, మాకు బీజేపీ ప్రభుత్వం కావాలి ప్రజల్లోకి ఆ నినాదం తీసుకు వెళ్లాలనని నళిన్ కుమార్ కటీల్ పిలుపునిచ్చారు. . ప్రేమ పేరుతో అమాయకులైన హిందూ అమ్మాయిలను లవ్ జీహాద్ పేరుతో లొంగదీసుకోవాలని అనుకునే వారికి మనం గట్టిగా బుద్ది చెప్పాలని నళిన్ కుమార్ కటీల్ బీజేపీ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమీపంలో ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అధికార పార్టీ ఓటర్లను పోలరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను నళిన్ కుమార్ కటీల్ తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయం చేస్తోంది, దేశంలో, కర్ణాటకలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు చూడటం లేదని, వారు ద్వేషంతో మాట్లాడుతున్నారని, దేశాన్ని విభజించాలని చూస్తున్నారు, మనం అభివృద్ధిని మాత్రమే చూస్తున్నాము నళిన్ కుమార్ కటీల్ అన్నారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్ ను ఎదుర్కోవటానికి కొత్తగా చట్టాలను పరిశీలిస్తున్నాయని. కర్ణాటకలో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడానికి మళ్లీ మనం అధికారంలోకి రావాలని, అందుకు ప్రతిఒక్కరు శక్తి వంచన లేకుండా పని చెయ్యాలని బీజేపీ కార్యకర్తలకు ఆ పార్టీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ పిలుపునిచ్చారు, మొత్తం మీద బీజేపీ కర్ణాటక చీఫ్ నళిన్ కుమార్ కటీల్ వ్యాఖ్యలతో ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications