Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీరు ప్రధాని ఐతే నన్ను పిలవండి, తుంటరిని: మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రోజు తమ ముఖాలు చూసి ప్రజలకు మొత్తిందని, ఈ రోజు లక్షలమంది విద్యార్థుల ముఖాలు చూస్తున్నారన్నారు. విద్యార్థులతో గడపడం వెనుక ఎలాంటి స్వలాభం లేదన్నారు. స్వలాభం వెతుక్కునే తత్వం తనది కాదన్నారు. విద్యార్థులు అంకితభావంతో ఉంటే తమ కలను సాకారం చేసుకోగలరన్నారు.

ప్రముఖుల ఆత్మకథలను చదవాలన్నారు. వ్యాయమ విద్య పైన దృష్టి సారించాలని హితవు పలికారు. గూగుల్ గురులో సమాచారం లభిస్తుందే తప్ప జ్ఞానం ఇవ్వదన్నారు. పారిశుద్యం పైన దేశవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రానురాను ప్రాధాన్యత కోల్పోతుందన్నారు. జపాన్‌లో తాను చూసిన బడిలో బోధించడం కాదని, నేర్చుకోవడం చూశానన్నారు. జపాన్‌లో ప్రజలు క్రమశిక్షణతో ఉండటం గమనించానని తెలిపారు.

బాలికలు చదువుకుంటే రెండు కుటుంబాలకు నేర్పుతారని, బాలికా విద్యకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, బస్తర్‌లలో విద్యా ప్రమాణాలు పెంచుతామని మోడీ హామీ ఇచ్చారు. ఓ విద్యార్థిని విద్యుత్ గురించి ప్రస్తావించినప్పుడు.. విద్యుత్‌ను ఆదే చేసేందుకు విద్యార్థులు కూడా కృషి చేయాలన్నారు. విద్యార్థులు అందరు తలుచుకుంటే కరెంట్ అదా చేయలేమా అన్నారు దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం ఉందన్నారు. విద్యుత్‌నే కాకుండా నీటిని కూడా ఆదా చేయాలన్నారు.

మంచి విద్య లేని అనుభవం రాణించదన్నారు. బాలికలకు ఇంటికి సమీప దూరంలో బడి ఉండేందుకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, సమీపంతో పాటు నాణ్యమైన విద్య కూడా అందించాలన్నారు. నైపుణ్యాల పెంపు ద్వారా ఉపాధికల్పన అవకాశాలు పెరుగుతాయన్నారు. కేవలం పట్టాలే కాదని, పట్టభద్రుల్లో నైపుణ్యం కావాలన్నారు. పట్టాలతో పాటు నైపుణ్యాల శిక్షణనిస్తామన్నారు. అన్ని వృత్తుల్లో మానవవనరులు ఉన్నా నైపుణ్యాల కొరత ఉందన్నారు.

విద్యార్థులు ఓడిపోవచ్చు, గెలవొచ్చు... కానీ ప్రయత్నం ముఖ్యమన్నారు. పిల్లలను సహజంగా ఎదగనివ్వాలని, వారి ఆటపాటలకు అడ్డు చెప్పవద్దన్నారు. పలువురు విద్యార్థుల ప్రశ్నలకు మోడీ సమాధానాలు ఇలా...

 Why don't students want to be teachers anymore: Narendra Modi asks students

విద్యార్థి: ఎప్పుడైనా ప్రధాని అవుతారని ఊహించారా?
మోడీ: నేను క్లాస్ లీడర్‌గా ఎప్పుడు పోటీ చేయలేదు. పాఠశాల ఎన్నికలలోను పోటీ చేయలేదు. ప్రధానిని అవుతానని ఎప్పుడు అనుకోలేదు.

విద్యార్థి: మీరు ప్రధాని ఎలా కాగలిగారు?
మోడీ: భారత దేశం ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా ప్రధాని అయ్యేందుకుఅవకాశముంది. మీలో భవిష్యత్తలో ఎవరైనా ప్రధానమంత్రి అయితే ప్రమాణ స్వీకారానికి నన్ను పిలవండి.

విద్యార్థి: అహ్మదాబాద్ నుండి వచ్చినందుకు అనుభూతి ఎలా ఉంది?
నాకు ఇల్లు, కార్యాలయం మధ్యనే సమయం గడిచిపోతోంది. ఢిల్లీని చూడలేకపోతున్నాను. విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశ ప్రగతి కోసం పని చేయాలి. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలాకాలం పని చేసిన అనుభవం ఉపయోగపడుతోంది. నేను మాట్లాడుతున్నది ఏమిటనేది ప్రధాని అయ్యాక మరింత స్పృహతో మాట్లాడుతున్నాను.

విద్యార్థి: చదువుకునే రోజుల్లో మీరు అల్లరి చేసేవారా?
మోడీ: నేను చదువుకునే రోజుల్లో తుంటరి పనులు చేసేవాడిని.

విద్యార్థి: నేను ప్రధానిని కావాలంటే ఎలా?
మోడీ: 2024 ఎన్నికలకు సమాయత్తం కావాలి. సదరు విద్యార్థికి మోడీ నవ్వుతూ సమాధానమిచ్చారు.

విద్యార్థి: మీరు హెడ్మాస్టర్ లాంటి వారని అందరు అంటుంటారు. కానీ అప్యాయంగా మాట్లాడుతున్నారు?
మోడీ: నేను నిజంగానే పని చేయించేవాడిని. అయితే, మొదట నేను పని చేసి, ఇతరులను అడుగుతాను.

విద్యార్థి: దేశానికి ఏదైనా మంచి సేవ చేయాలనుంది, ఏం చేయాలి?
మోడీ: మొదటి నుండి మిమ్మల్ని మీరు మలచుకోండి. అదే గొప్ప సేవ.

విద్యార్థి: పర్యావరణం, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు కారణం ఏమిటి?
మోడీ: మన అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల వాటిలో మార్పులు వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు తోడ్పాటునివ్వాలి. ఒకప్పుడు మనం ఎంతో పర్యావరణహితంగా జీవించాం.

విద్యార్థి: సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమా?
మోడీ: దేశ సేవకు రాజకీయాలు ఒకానొక సాధనం మాత్రమే. మనం చేసే చిన్న చిన్న మంచి పనులు కూడా దేశ సేవగా భావించాలి. రాజకీయాలను ఒక వృత్తిగా చూడకూడదు. దేశసేవగా భావించాలి. మిలటరీలోనో, రాజకీయాల్లోనో చేరితేనే సేవ చేసినట్లు కాదు. మనం పాటించే శుభ్రత మన వ్యక్తిత్వ నిర్మాణంలో భాగం అవుతుంది. భారతీయులు నా కుటుంబ సభ్యులు. వారి సంతోషాలు, బాధలు నావిగా భావిస్తాను. నా కుటుంబ సభ్యుల్లాంటి ప్రజల కోసం మరింత ఎక్కువగా పని చేస్తాను. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మారుస్తాం. అన్ని భాషల్లో సాంకేతిక విద్యను అభివృద్ధి చేస్తాం. విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. హాస్య పుస్తకాలు అయినా చదవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+