ముంబైలోని ప్లాట్స్‌ను లండన్ వాసులే ఎందుకు కొంటున్నారు..!
ముంబై: ముంబైలో 117 అంతస్ధులతో నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం 'వరల్డ్ వన్ టవర్స్'లో ప్లాట్స్‌ను లండన్ వాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట. అత్యంత విలాసవంతమైన ఈ భవనంలో ఫ్లాట్ విలువ 1.4 మిలియన్ పౌండ్లు.
జార్జియో అర్మానీ రూపొందించిన ఈ భవనం ప్రపంచంలో నివాసగృహాలు ఉండే అత్యంత ఎత్త్తెన భవనంగా రికార్డు సృష్టించింది. లండన్‌లో ఉంటున్న భారతీయులు, అప్పుడప్పుడు భారత్‌కు వచ్చే భారత సంతతికి చెందిన మిలియనీర్లను టార్గెట్ చేసుకుని ఈ ఫ్లాట్స్‌ను రూపొందిస్తున్నారు.

ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన భవనాలు జాబితాలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ వచ్చే ఏడాదికి పూర్తికానుంది. 442 మీటర్ల ఎత్తులో 205 మిలియన్ పౌండ్లకు పైగా ఖర్చుపెట్టి ఈ భవనాన్ని ముంబై సముద్రతీరానికి అతి సమీపంలో నిర్మిస్తున్నారు.
ఇందులో మొత్తం 300 అత్యంత విలాసవంతమైన ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌లో రిసెప్షన్ రూం, కిచెన్, బెడ్‌రూమ్ సూట్‌లతోపాటు, అందంమైన స్నానపు గదులు ఉన్నాయి. వీటితో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, హెల్త్ క్లబ్ ప్రత్యేకం. వీటిని సొంతం చేసుకోవడానికి లండన్‌లో మిలియనీర్లు ముందుకు వస్తున్నారు. దీంతో లండన్‌లో ఫ్లాట్స్ అమ్మకం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications