వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా అయితే, మా ఆయనకు గన్ ఎందుకిచ్చారు?: జవాను భార్య

సైనికులకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారని ఆరోపించిన బీఎస్ఎఫ్ జవాను తేజ్‌ బహదూర్‌కి అండగా నిలిచింది ఆయన కుటుంబం.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సైనికులకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలు రక్షణ శాఖలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. దానిపై బీఎస్‌ఎఫ్‌ అధికారులు స్పందిస్తూ తేజ్‌ బహదూర్‌ను తప్పుబట్టారు. అతడి క్రమశిక్షణా రాహిత్యాన్నిగురించిన విషయాలు బహిర్గతం చేశారు.

అతడు మద్యపానం చేస్తాడని, విధి నిర్వహణ సరిగా చేయడని ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను కొట్టిపడేస్తూ తేజ్‌ బహదూర్‌కి అండగా నిలిచింది ఆయన కుటుంబం.
మంచి ఆహారం ఇవ్వమని కోరడం కూడా తప్పేనా అని తేజ్‌ భార్య షర్మిల ప్రశ్నించారు. ఆయన మానసిక స్థితి సరిగా లేదంటున్నారు, అలాంటప్పుడు సరిహద్దులో విధినిర్వహణకు ఎలా పంపించారని షర్మిల ప్రశ్నించారు.

<strong>ఆ జవాను మద్యానికి బానిస, నేరచరితుడు: బీఎస్‌ఎఫ్‌</strong>ఆ జవాను మద్యానికి బానిస, నేరచరితుడు: బీఎస్‌ఎఫ్‌

Why give my husband a gun if he’s unstable: BSF jawan’s wife

సైనికుల సమస్యల పట్ల గొంతు విప్పి ప్రశ్నించినందుకే తేజ్‌ బహదూర్‌ సర్వీసు రికార్డుల గురించి వారు మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ కుమారుడిని కూడా సైన్యంలోకే పంపాలనుకున్నామని, ఇప్పుడా ఆలోచన విరమించుకుంటున్నామని షర్మిల చెప్పారు. బీఎస్‌ఎఫ్‌ తేజ్‌ బహదూర్‌ పరువుకు భంగం కలిగించే ప్రయత్నంచేస్తోందని ఆయన మీద అవినీతి, క్రమశిక్షణారాహిత్యం పేరుతో అన్యాయంగా ఆరోపణలు చేస్తోందని తేజ్‌ బహదూర్‌ సోదరుడు హనుమాన్‌ మీడియాతో అన్నారు.

తమ కుటుంబమే సైనిక కుటుంబమని, తమ తాత సుభాష్‌ చంద్రబోస్‌ సైన్యంలో పనిచేశారని తెలిపారు. ఐదుగురు అన్నదమ్ముల్లో తేజ్‌ బహదూర్‌ చిన్నవాడని, తమ మరో సోదరుడు కూడా బీఎస్‌ఎఫ్‌లో ఉన్నాడని, ఒక సోదరుడి కొడుకు సైన్యంలో ఉన్నాడని తెలిపారు. తేజ్‌ బహదూర్‌ అలా చేయడానికి కారణం.. వ్యవస్థను మెరుగు పర్చాలన్న ఉద్దేశమేనన్నారు. ఇప్పుడు పై అధికారుల ప్రతిస్పందన చూస్తే తమవారందరికీ ఇబ్బందులు కలిగేలా ఉన్నాయన్నారు.

కాగా, వృద్ధులైన తేజ్‌ తల్లిదండ్రులకు ఈ ఆరోపణలేవీ తెలియవట. తమ కుమారుడు సరైన తిండి తిప్పలు లేకుండా సైన్యంలో పనిచేస్తున్నందున అతడిని వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోవలసిందిగా కోరుతున్నట్లు తండ్రి షేర్‌ సింగ్‌ తెలిపారు. తేజ్‌ డిసెంబరులో ఇంటికి వచ్చాడని, తమకు పశువులకు పెట్టే తిండి పెడతారని చెప్పాడని ఆయన ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు.

English summary
The wife of the BSF jawan whose video about inferior food served to paramilitary personnel hit the headlines spoke out in defence of her husband on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X