పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తేలేం: కారణం చెప్పిన నిర్మలమ్మ
పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నుల భారం గురించి ప్రజలు తరచూ ప్రశ్నిస్తుంటారు. వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చితే ధరలు తగ్గుతాయనేది సామాన్య ప్రజల అభిప్రాయం. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఈ అంశాలపై మాట్లాడారు.
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం సిద్ధం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం ప్రధాన అడ్డంకి అని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు పెట్రోల్, డీజిల్‌ను అందులో చేర్చడానికి ప్రయత్నించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్దతు లభించలేదని ఆమె తెలిపారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు విధించే పన్నుల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతాయి. ఈ ఆదాయం కోల్పోవడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవని నిర్మలమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రేట్లపై ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని.. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని ఆమె స్పష్టం చేశారు.

జీఎస్టీ 2.0: సామాన్యుడికా లాభం
జీఎస్టీలో తాజాగా చేపట్టిన సంస్కరణల గురించి మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వీటి వల్ల 99 శాతం ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గాయని తెలిపారు. పన్నుల తగ్గింపు వల్ల వచ్చిన లాభాలను కంపెనీలు ప్రజలకు బదిలీ చేయాలని, అలా చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం ప్రతి సంవత్సరం జీఎస్టీలో పన్ను సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఎక్కడ పన్ను తగ్గించవచ్చో గమనించి అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి కూడా అదే చేశామన్నారు. ఇది కేవలం సామాన్య ప్రజల కోసం తీసుకున్న నిర్ణయమని, కంపెనీల కోసం కాదన్నారు.
విమర్శలకు నిర్మలమ్మ కౌంటర్
విపక్షాలు జీఎస్టీని 'గబ్బర్ సింగ్ ట్యాక్స్' అని విమర్శించడంపై నిర్మలా సీతారామన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఒకప్పుడు 91 శాతం పన్నులు విధించినవారు ఇప్పుడు జీఎస్టీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. "ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయపు పన్నుపై 91 శాతం పన్ను విధించింది. అలాంటి వాళ్లు ఇప్పుడు జీఎస్టీని విమర్శించడం విడ్డూరం. విపక్షాల నుంచి జీఎస్టీకి మద్దతు లభిస్తే అదే చాలు" అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇది ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన సంస్కరణ అని, రాజకీయాలు చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.
-
యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications