పెళ్ళై వారమే ట్విస్టిచ్చిన వధువు:ప్రియుడితో భార్యకు పెళ్ళి చేసిన భర్త

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్: వివాహం చేసుకొన్న వారం రోజులకే తన భార్యను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది. వివాహమైన వారం రోజులకే తన ప్రియుడికే ఇచ్చి వివాహం చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

వివాహనికి ముందే మరో యువకుడితో సంబంధాలున్నాయనే విషయం తెలిస్తే ఆ యువతిపై దాడులు చేయడమో, వదిలేయడం లాంటి ఘటనలను మనం చూస్తున్నాం, కానీ, దానికి భిన్నంగా ఒడిశా రాష్ట్రంలో ఘటన చోటు చేసుకొంది.

మరో యువకుడితో ప్రేమలో ఉన్న యువతికి ఆ యువకుడికిచ్చి వివాహం చేయకుండా మరో యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. తన భార్యకు మరో యువకుడితో ప్రేమాయణం ఉందని గుర్తించి పెద్ద మనసుతో నిర్ణయం తీసుకొన్నాడు.

ప్రియుడితో భార్యకు వివాహం చేసిన భర్త

ప్రియుడితో భార్యకు వివాహం చేసిన భర్త

ఒడిశా రాష్ట్రంలోని సుందర్‌ఘడ్ జిల్లా బర్గామ్ బ్లాక్ పరిధిలోని పామర గ్రామానికి చెందిన బాసుదేవ్ టప్పో అనే యువకుడు జార్సుగూడ దేబ్బి గ్రామానికి చెందిన 24 ఏళ్ళ యువతిని మార్చి4న, వివాహం చేసుకొన్నాడు. అయితే వివాహనికి ముందే తన భార్యకు మరో యువకుడితో ప్రేమాయణం ఉందని తెలుసుకొని ఆమెను ప్రియుడికిచ్చి వివాహం చేశాడు.

బావతో ప్రేమాయణం

బావతో ప్రేమాయణం

వివాహమైన తర్వాత బాసుదేవ్ టప్పో అనే యువకుడు వివాహం చేసుకొన్న తర్వాత తన భార్యను ఓ యువకుడు వచ్చి చితకబాదాడు. అసలు విషయాన్ని టప్పో ఆరా తీశారు. ఆ సమయంలో అసలు విషయం బయటపడింది. తన భార్యకు బావతోనే ప్రేమాయణం ఉందని తెలిసింది.దాడి చేసింది కూడ బావేనని తెలుసుకొన్నాడు.

భార్య కుటుంబసభ్యులను ఒప్పించాడు

భార్య కుటుంబసభ్యులను ఒప్పించాడు

ఈ విషయం తెలిసిన వెంటనే భార్య కుటుంబసభ్యులను బాసుదేవ్ టప్పో ఒప్పించాడు. భార్య కుటుంబసభ్యులతో ఈ విషయమై చర్చించాడు. తన భార్య ప్రేమించిన బావతో పెళ్ళి జరిపించాడు. ఈ వివాహనికి పామర గ్రామ సర్పంచ్ గజేంద్రబాగ్ కూడ మద్దతుగా నిలిచారు.

టప్పోను అభినిందించిన గ్రామస్థులు

టప్పోను అభినిందించిన గ్రామస్థులు

తన భార్యను వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసిన టప్పోను గ్రామస్థులు అభినందించారు . పెద్ద మనుసుతో టప్పో మంచి నిర్ణయం తీసుకొన్నాడని గ్రామస్థులు టప్పో నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The village of Pamara in Bargaon block of Sundargarh district on Saturday played host to a unique wedding where a man helped solemnise the marriage of his wife with her lover, barely six days after his own arranged wedding with her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి