దారుణం: అద్దెకు ఉంటోన్న వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అద్దె ఇంట్లో నివసిస్తోన్న వితంతువు ఒకరు హత్యకు గురయ్యారు. ఆమె నివసిస్తోన్న ఇంటి ఓనరే ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంటి ఓనర్, అతనికి సహకరించిన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. హతురాలి పేరు మంజు గోయల్. ఏడాది కిందట ఆమె భర్త మరణించాడు. దీనితో ఆమె ఆరు నెలలుగా న్యూఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓ చిన్న ఇంట్లో అద్దె ఒంటరిగా నివసిస్తున్నారు. ఆ ఇళ్లు సతీష్ పహ్వా అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిది. రెండురోజుల కిందట సతీష్ పహ్వా ఇంట్లో కొన్ని వస్తువులు, కొంత నగదు చోరీకి గురైంది.
ఈ దొంగతనం చేసింది మంజు గోయెల్ అని అనుమానించారు సతీష్ కుటుంబ సభ్యులు. శనివారం రాత్రి ఆమెపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో మరణించింది. ఆమె చనిపోయినప్పటికీ పట్టించుకోలేదు ఓనర్, అతని కుటుంబ సభ్యులు.

ఇంట్లో చొరబడి ఆమె దాచుకున్న 60 వేల రూపాయలను లాక్కున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే మంజు గోయల్ సోదరుడు సంఘటనాస్థలానికి రాగా.. అతడిపైనా దౌర్జన్యం చేశారు. దీనిపై స్థానికులు మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సతీష్ పహ్వా, అతని కుమారుడిని హత్యానేరం కింద అరెస్టు చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications