Wife: ఫస్ట్ భార్యతో పార్ట్ టైమ్, రెండో భార్యతో ఫుల్ టైమ్, ప్రభుత్వ ఉద్యోగిని రెండో భార్య ఏం చేసిదంటే !
ఫరీదాబాద్/ హర్యానా: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి గతంలో కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని మొదటి భార్య ఉన్న సమయంలోనే కొన్ని సంవత్సరాల తరువాత ఆయన మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంతకాలం ఇద్దరు భార్యలతో ప్రభుత్వ ఉద్యోగి కాపురం చేస్తున్నాడు. మొదటి భార్యకు కొడుకు, రెండో భార్యకు కూతురు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త కొంతకాలం వరకు రెండో భార్యకే ఎక్కువగా డబ్బులు ఇచ్చేవాడని తెలిసింది. అయితే ఇటీవల రెండో భార్యతో అతనికి గొడవలు మొదలైనాయి. రెండో భార్య, ఆమె కూతురు, బావమరిది కలిసి ప్రభుత్వ ఉద్యోగిని టార్చర్ పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాత్రి భర్తతో అతని రెండో భార్య గొడవ పెట్టుకుంది. గొడవ పెద్దది అయ్యింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రెండో భార్య, ఆమె కూతురు, బావమరిది కలిసి తహసిల్దార్ ఆఫీసులో పని చేసే రిజిస్ట్రీ క్లర్క్ ను దారుణంగా కొట్టి చంపేయడం కలకలం రేపింది. మొదటి భార్య కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

తహసిల్దార్ ఆఫీసులో ఉద్యోగం
హర్యానాలోని ఫరీదాబాద్ సెక్టార్ 12లోని తహసిల్దార్ ఆఫీసులో రిజిస్ట్రీ క్లర్ గా ఉద్యోగం చేస్తున్న రాజేందర్ (50) అనే వ్యక్తి గతంలో కుటుంబ సభ్యులు చూపించిన మమత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రాజేందర్, మమత దంపతులకు కొన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టలేదని సమాచారం.

రెండో పెళ్లి చేసుకున్నాడు
వివాహం చేసుకుని మొదటి భార్య మమత ఉన్న సమయంలోనే 32 సంవత్సరాల క్రితం రాజేందర్ బాలా (48) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంతకాలం ఇద్దరు భార్యలు మమత, బాలాతో ప్రభుత్వ ఉద్యోగి రాజేందర్ చక్కగానే కాపురం చేస్తున్నాడు. రెండో బాలాకు సుమన (30) అనే కుమార్తె ఉంది.

రెండో భార్యతో తేడాలు
బాలను వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాల తరువాత రాజేందర్ మొదటి భార్య మమతకు ఓ కొడుకు పుట్టాడు. రాజేందర్, మమత దంపతుల కొడుకు వయసు 16 సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాజేందర్ కొంతకాలం క్రితం వరకు రెండో భార్య బాలాకే ఎక్కువగా డబ్బులు ఇచ్చేవాడని తెలిసింది. అయితే ఇటీవల రెండో భార్య బాలా, రాజేందర్ ల మద్య గొడవలు మొదలైనాయి.

రాత్రి భర్తను తగులుకున్న రెండో భార్య
రెండో భార్య బాలా, ఆమె కూతురు సుమన, బావమరిది క్రిష్ణ (35) కలిసి ప్రభుత్వ ఉద్యోగి రాజేందర్ ను టార్చర్ పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాత్రి రాజేందర్ తో అతని రెండో భార్య బాలా గొడవ పెట్టుకుంది. రాజేందర్, బాలాల మద్య గొడవ చాలా పెద్దది అయ్యిందని సమాచారం. తరువాత రాజేందర్, బాలా ఎవరిపాటికి వాళ్లు వేర్వేరు రూమ్ ల్లో నిద్రపోయారు.

రెండో భార్య, కూతురు, బావమరిది కలిసి చంపేశారు
మరుసటి రోజు ఉదయం మళ్లీ గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రెండో భార్య బాలా, ఆమె కూతురు సుమన, బావమరిది క్రిష్ణ కలిసి కర్రలు, ఇనుపరాడ్ తో రాజేందర్ మీద దాడి చేసి చంపేశారు. తహసిల్దార్ ఆఫీసులో పని చేసే రిజిస్ట్రీ క్లర్క్ రాజేందర్ ను అతని భార్య, కూతురు దారుణంగా కొట్టి చంపేయడం కలకలం రేపింది. రాజేందర్ మొదటి భార్య మమత కేసు పెట్టడంతో బాలా, సుమన, క్రిష్ణను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఫరీదాబాద్ డిప్యూటీ పోలీసు కమీషనర్ నితీష్ అగర్వాల్ చెప్పారని పీటీఐ వార్త సంస్థ కథనం ప్రచురించింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications