ప్రియుడి కోసం భర్త మర్మాంగాలపై దాడి చేసిన భార్య హత్యాయత్నం.. తర్వాత జరిగిందిదే!

దేశంలో మహిళల్లో క్రూరత్వం రోజురోజుకీ పెరిగిపోతోంది. భార్యలు భర్తలను హత మారుస్తున్న ఘటనలు సభ్య సమాజం నివ్వెర పోయేలా చేస్తున్నాయి. ఇక తాజాగా కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన ఒక మహిళ భర్తను హతమార్చడానికి ప్రయత్నించింది. ప్రియుడి కోసం భర్త మర్మాంగాల పైన దాడి చేసి చంపేందుకు యత్నం చేసింది.

పరాయి మగాడి మోజులో పడి భర్తను హతమార్చే యత్నం చేసిన భార్య
పరాయి మగాడి మోజులో పడిన ఆమె భర్తను అంతమొందించడానికి రాక్షసిలా మారింది. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న ట్విస్ట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ఇండి అక్కమహాదేవి కాలనీలో బీరప్ప పూజారి, సునంద దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సునంద సిద్ధప్ప అనే వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకొని అది కాస్త అక్రమ సంబంధంగా మారింది.

Wife attempts murder after attacking husband private parts for her lover Here s what happened next

ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసే యత్నం చేసిన భార్య
సిద్ధప్ప తో తన సంబంధానికి భర్త బీరప్ప అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరు అతడిని అంతమొందించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో తాజాగా బీరప్ప రాత్రివేళ నిద్రపోతున్న క్రమంలో సునంద భర్త గొంతు నులిమి అతని మర్మాంగాల పైన దాడి చేసి చంపేందుకు ప్రయత్నించింది. భర్తను హతమార్చడానికి ప్రయత్నిస్తున్న సునంద కు ప్రియుడు సిద్ధప్ప కూడా సాయం చేశాడు.

పెళ్ళాం కుట్ర నుండి తప్పించుకున్న భర్త
బీరప్ప మేలుకొని కాళ్లతో ఎయిర్ కూలర్ ని గట్టిగా కొడుతూ కేకలు వేయడంతో ఇంటి యజమాని దంపతులు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక బీరప్ప ఎనిమిదేళ్ల కుమారుడు కూడా తలుపులు తీయడంతో సునంద చేసిన దారుణం బయటకు వచ్చింది. భార్య, ప్రియుడి ప్లాన్ అడ్డం తిరిగింది.

ఆస్పత్రిలో భర్త... పోలీసుల అదుపులో భార్య, ప్రియుడు
ప్రస్తుతం బీరప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక భర్తను హతమార్చడానికి ప్రయత్నం చేసిన సునందను, ఆమెకు సహకరించిన సిద్ధప్ప ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో మహిళల్లో పెరుగుతున్న క్రూరత్వం, ప్రియుల కోసం భర్తలను హతమార్చడానికి చూపిస్తున్న పైశాచికత్వం ఇప్పుడు సమాజంలో పెనుముప్పుగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+