
ఫ్రెండ్ కారులో వెళ్లిన భార్య, తొంగి చూసిన అత్త, భర్త ఏం చేశాడంటే ?, చెట్టుకు కట్టేసి !
జైపూర్/ రాజస్తాన్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భార్య పుట్టింటికి వెళ్లాలని చెప్పినా, అక్కడి నుంచి రావాలని చెప్పినా భర్త ఆమెను పిలుచుకుని వెళ్లి పిలుచుకుని వస్తున్నాడు. అయితే పొరపాటున పుట్టింటికి వెళ్లి ఫ్రెండ్ కారులో అత్తారింటికి వెళ్లిన మహిళను ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి చితకబాదడం కలకలం రేపింది.
రాజస్థాన్ లోని ఖమేరా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న వ్యక్తి వివాహం చేసుకున్నాడు. భార్య మీద ఆమె భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుులు నిఘా వేశారు. పుట్టింటికి వెళ్లిన మహిళ అత్తారింటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. తాను రాలేనని, నువ్వు బస్సులో రావాలని భర్త ఆమెకు చెప్పాడు. భర్త చెప్పినట్లు భార్య బస్సులో బయలుదేరింది.

భర్త నివాసం ఉంటున్న గ్రామానికి దూరంలోని పట్టణంలో దిగిన మహిళ బస్సు కోసం చాలాసేపు వేచి చూసింది. ఆ సందర్బంలో భర్త స్నేహితుడు అటువైపు కారులో వెలుతూ ఆమెను చూశాడు. స్నేహితుడి భార్య బస్సు కోసం వేచి చూస్తోందని, ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యాలని అనుకున్నాడు. స్నేహితుడి భార్యను కారులో కుర్చోబెట్టుకుని వెళ్లి ఆమె అత్తారింటి దగ్గర డ్రాప్ చేశాడు.
మహిళ వేరు మగాడి కారులో వచ్చి ఇంటి దగ్గర దిగుతున్న సీన్ ను ఆమె అత్త చూసింది. కొడుకు ఇంటికి రాగానే నీ పెళ్లామ్ ఎవడి కారులోనో వచ్చి ఇక్కడ దిగిందని అతని తల్లి చెప్పింది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేసి చితకబాదేశారు. పరాయి మగాడి కారులో నువ్వు తిరుగుతావా అంటూ భర్త రెచ్చిపోయాడు.
గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే భర్తతో పాటు అతని కుటుం సభ్యులు చిందులు వేశారు. పోలీసులు వెళ్లి విచారణ చేస్తే ఇది మా కుటుంబ సమస్య, మీరు జోక్యం చేసుకోకూడదని భర్త చిందులు వేశాడు. దెబ్బకు పోలీసులు మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన ఆమె భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు.