కుల వివక్ష: భార్య కోసం సొంతంగా బావిని తవ్వాడు
నాగ్ పూర్: ఈ వేసవి దేశ వ్యాప్తంగా కరువుని సృష్టించింది. ప్రజలంతా గుక్కెడు నీటి కోసం నానావెతలు పడుతున్నారు. అలాంటిది ఓ ఊరిలో నీటి కోసం బావి వద్దకు వచ్చిన ఒక మహిళను 'నీవు దళితరాలివి. నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు' అని ఉన్నత వర్గాల వ్యక్తులు అడ్డుకున్నారు.
దీంతో తన భార్యను నీళ్లు పట్టుకోవవద్దని, అడ్డుకున్నారన్న బాధతో స్వశక్తితో బావిని తవ్వి పట్టుదలను చాటుకున్నాడు. నాగ్‌పూర్‌కు సమీపంలోని కరవు పీడిత విధర్భ ప్రాంతంలోని వాషిమ్ జిల్లా కొలంబేశ్వర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఊరిలోని ఓ బావి నుంచి నీటిని తీసుకెళ్లేందుకు వచ్చిన బాపూరావ్ తాజ్నే అనే దళితుడి భార్యను ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు అందుకు అనుమతించలేదు. దీంతో తాజ్నే దళితుడికి కుల కట్టుబాట్లు కూలగొట్టాలన్నంత కోపం వచ్చింది.

ఇంకేముంది వెంటనే అగ్రవర్ణాల పట్ల వివక్షపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన తాజ్నే చుట్టుపక్కల వారు సాధ్యం కాదని వారించినా 40 రోజులపాటు తీవ్రంగా శ్రమించి ఊరిలో సొంతంగా ఓ బావిని తవ్వాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని దళితులంతా ఈ బావిలోని నీటితోనే దాహార్తిని తీర్చుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ ఆ గ్రామానికి వెళ్లి బాపూరావ్ తాజ్నేను అభినందించారు. గ్రామంలో కులవివక్ష నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బావి తవ్వాలని తాను పూనుకున్నప్పుడు అందరూ తనను ఎగతాళి చేశారని, ఇది సాధ్యమయ్యే పని కూతురు కాదని అవహేళన చేశారని పేర్కొన్నాడు.
అయినా సరే పట్టుదలతో పూర్తిచేశానని తాజ్నే పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తాజ్నే భార్య నీళ్లు తెచ్చుకోకుండా గ్రామస్థులు అడ్డుకున్న సంగతి తమ దృష్టికి రాలేదని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications