Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

25 సార్లు 25 మందితో పారిపోయిన భార్య.. ఆ ఒక్క కారణంతో ఆమెను పల్లెత్తు మాట అనని భర్త..

ఆమె ఓ వివాహితురాలు... ముగ్గురు పిల్లలకు తల్లి... వైవాహిక జీవితంలో ఆమెకు సంతృప్తి లేదో లేక ఇష్టం లేని పెళ్లి చేసుకుందో తెలియదు గానీ... ఇప్పటివరకూ 25 సార్లు 25 మంది వ్యక్తులతో పారిపోయింది. పారిపోయిన ప్రతీసారి... కొన్నాళ్లకు తిరిగి భర్తకు వద్దకు చేరడం... అతనూ ఆమెను పల్లెత్తు మాట అనకుండా మళ్లీ తన భార్యగా స్వీకరించడం జరుగుతూ వస్తోంది. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి తన భార్యను ఏమీ అనలేకపోతున్నానని ఆ భర్త ధీనంగా వాపోతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే... నగావ్ జిల్లాలోని థింగ్ లహ్కర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల మఫీజుద్దీన్‌ వృత్తి రీత్యా డ్రైవర్. అతనికి 10 ఏళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. 2011లో వీరి పెళ్లి జరగ్గా... ఈ పదేళ్ల కాలంలో ఆమె 25 సార్లు భర్తను,పిల్లలను విడిచి పారిపోయింది.పారిపోయిన ప్రతీసారి ఎవరో ఒక వ్యక్తితో ఎక్కడెక్కడో గడిపి వచ్చేది. అలా ఇప్పటివరకూ 25 మంది వేర్వేరు వ్యక్తులతో పారిపోయింది.

wife eloped with her lovers 25 times still her husband accepting her

'2011లో మా పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ నా భార్య 25 సార్లు లేచిపోయింది. అలా పారిపోయి... తిరిగి ఇంటికొచ్చిన ప్రతీసారి ఇంకెప్పుడూ ఇలా చేయనని మాటిచ్చేది.కానీ ఆ మాటను ఆమె ఎప్పుడూ నిలబెట్టుకోలేదు.కొన్నిసార్లు చుట్టాల ఇంటికి అని చెప్పి వెళ్తుంది.కొన్నిసార్లు బంధువులు అనారోగ్యంతో ఉన్నారని... చూసొస్తానని చెప్పి వెళ్తుంది. మాకు ముగ్గురు పిల్లలు. ఆమె ఎన్నిసార్లు పారిపోయి మళ్లీ తిరిగొచ్చినా... నా పిల్లల కోసమే ఆమెతో కాపురం చేస్తున్నాను.' అని మఫీజుద్దీన్ వాపోయాడు.

ఇటీవల సెప్టెంబర్ 4న నేను పని నుంచి తిరిగొచ్చేసరికి నా భార్య మళ్లీ పారిపోయిందని తెలిసింది.మూడు నెలల పసి పిల్లాడిని పక్కింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయింది. మేకలకు దాన తీసుకొస్తానని పక్కింటివాళ్లతో చెప్పి వెళ్లింది. మళ్లీ ఆమె ఎప్పుడు తిరిగొస్తుందో నాకు తెలియదు.' అని మఫీజుద్దీన్ చెప్పుకొచ్చాడు.ఈసారి ఆమె రూ.22వేల నగదు,ఇంట్లోని కొన్ని వస్తువులు తీసుకుని పారిపోయిందని చెప్పాడు. ఆమె ఎవరితో పారిపోయిందనే విషయం తనకు తెలియదన్నాడు.

'నేను ఆమెను నిజాయితీగా ప్రేమిస్తున్నాను.మాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.ఒకవేళ నేను ఆమెను అంగీకరించకపోతే నా పిల్లలను ఎవరు చేసుకుంటారు.అందుకే ఇంతవరకూ ఎప్పుడూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.' అని మఫీజుద్దీన్ చెప్పాడు.

Recommended Video

    Shikhar Dhawan సింగిల్.. ఇంతకీ ఎవరీ Ayesha Mukherjee | గబ్బర్ కంటే పదేళ్లు పెద్ద || Oneindia Telugu

    స్థానికులు మాట్లాడుతూ.. మఫీజుద్దీన్‌ భార్యకు గ్రామంలో చాలామంది యువకులతో వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. లవర్స్‌తో ఇంటి నుంచి పారిపోవడం... కొన్ని వారాలు లేదా నెలలకు మళ్లీ ఇల్లు చేరడం ఆమెకు అలవాటైపోయిందని పేర్కొన్నారు. ఆమెకు ఆరు,మూడు సంవత్సరాల వయసున్న ఒక బాబు,కూతురు,మూడు నెలల వయసున్న మరో కుమారుడు ఉన్నట్లు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+