పక్క వాడి భార్య కావాలా : టైం - రేటు మాట్లాడి తీసుకెళ్లటమే : ఆ జిల్లాలో అద్దెకు భార్యలు..!!
అది అక్కడ ఆచారం. భార్య పరాయి మగాడితో మాట్లాడితేనే భర్తలు తట్టుకోలేని వాళ్లను చూస్తాము. పరాయి మగాడితో సంబంధం ఉంటే భార్యను భర్త...భర్తను భార్య చంపేస్తున్న ఘటనలు చూస్తున్నాం. కానీ, ఎక్కడో నాగరికం లేని ప్రాంతంలో కాదు. మన దేశంలోనే జరుగుతోంది. కానీ, అక్కడ మాత్రం పరాయి వాళ్లు తమ భార్యలను కావాలని కోరుకుంటే పంపిస్తారట. దీని కోసం ఎంత సమయం ఉండాలో...ఎంత డబ్బు తీసుకుంటారో కూడా ముందుగానే స్టాంప్ పేపర్ మీద అగ్రిమెట్ తీసుకుంటారు.

ఎంతో మంది ప్రయత్నించినా మారని పరిస్థితులు
ఇటువంటి వింత ఆచారం ఇప్పటికీ మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో కొనసాగుతోందంటూ కధనాలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా..ఎన్ని సంఘాలు పుట్టుకొచ్చినా ఇక్కడ ఆ విధానం మాత్రం మారటం లేదు. అయితే, భర్తలే తమ భార్యలను అద్దెకు ఇవ్వటం ఇక్కడ మాత్రమే చూడగలం. తీసుకొని వెళ్లాలనుకొనే వారు ఎన్ని రోజులు..నెలలు..సంవత్సరాలు అనేది వారి అవసరాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఇది వారు గౌరవంగా చెప్పుకొనేది సంప్రదాయం. దాని పేరు ధడిచా.

డబ్బు ఉండి..వివాహం కాని వారైతే చాలు
ఈ సంప్రదాయంలో భాగంగా ప్రకారం డబ్బు ఉండీ.. పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే వారు వేరొకరి భార్యతను తీసుకెళ్లి భార్యగా కొనసాగించుకొనే ఛాన్స్ ఉంటుంది. తీసుకెళ్లే సమయంలో భర్తలకు రూ 10 నుంచి రూ 100 విలువైన స్టాంపులపైన సంతకాలు చేయాల్సి ఉంటుందది. రేటు మాట్లాడుకొని నిర్ణయాలు జరిగిపోతాయి. ఒక్కో మహిళ రేటు పదివేలు నుంచి లక్ష వరకు ఉంటుంది. ఆమె కూడా అచ్చం సొంత భార్యలానే ప్రవర్తించాలి.

ఆ సమయంలో పిల్లలు పుట్టినా వారిదే బాధ్యత
మరో విచిత్రం ఏంటంటే ఆ సమయంలో ఆ మహిళకు పిల్లలు పుట్టినా తీసుకెళ్లిన వారే వారి బాధ్యతలు తీసుకోవాలి. వయస్సు తక్కువ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. దస్తావేజులన్నీ పక్కాగా ఉన్న తర్వాతే భార్యను అద్దె భర్త ఇంటికి పంపిస్తారు. అమ్మాయిని రాష్ట్రం దాటి పోనివ్వరు. పెళ్లి కాని వారిని అద్దెకు తీసుకున్న సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో ముట్టచెబుతుంటారట. ఈ ఆచారాన్ని పోలీసులు మాన్పించాలని ప్రయత్నించినా ఆగినట్లే కొద్ది రోజులు ఆగినా..మళ్లీ మామూలే.












Click it and Unblock the Notifications