గుజరాత్‌లో దారుణం: మరుగుతున్న నూనెలో వాళ్లిద్దరి చేతులు పెట్టించిన భార్య..
అహ్మదాబాద్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. పక్కింటి అమ్మాయితో భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో.. వారిద్దరి చేతులను మరిగే నూనెలో పెట్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. సుమన్-రాహుల్ దంపతులు రాజ్‌కోట్‌లో నివసిస్తున్నారు. ఇద్దరి వయసు ముప్పైలలో ఉంటుంది. వీరి పొరుగింట్లో ఓ 17ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఇటీవల రాహుల్ ఆ బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సుమన్ కి అనుమానం వచ్చింది.

ఇదే విషయంపై అతన్ని నిలదీసిన భార్య.. రాహుల్ ను తన నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించింది. ఇందుకోసం మరిగే నూనెలో బాలికతో కలసి చేతులు పెట్టాల్సిందిగా చెప్పింది. దీంతో భార్య చెప్పినట్టే చేశాడు రాహుల్. మొదట బాలికతో బలవంతంగా నూనెలో చేతులు పెట్టించిన అతను.. ఆపై తనూ పెట్టాడు.
ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో స్థానిక ఆసుపత్రి తరలించారు. ఘటనపై మీడియాతో మాట్లాడిన బాధిత బాలిక.. గత కొంతకాలంగా రాహుల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పడం గమనార్హం. బాధిత బాలిక తల్లిదండ్రులు సుమన్-రాహుల్ లపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications