magician: భార్యకు ఆరోగ్యం బాగాలేదని మాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు, ఆంటీని వదిలేసి వాడు ఏం చేశాడు ?

అనారోగ్యంగా ఉన్న భార్యను ఆమెను భర్త మంత్రగాడి దగ్గరకు పిలుచుకుని వెళ్లాడు. మంత్రగాడు మీ ఇంటిలో పూజలు చెయ్యాలని, పూజలు చేస్తే దోషాలు పోతాయని దంపతులను నమ్మించాడు. అప్పటి నుంచి మంత్రగాడు వాళ్ల ఇంటికి వచ్చి వెలుతున్నాడు.

చెన్నై/కన్యాకుమారి: ఐటీ రంగంలో దూసుకుపోతున్న భారతదేశంలో ఇంకా మూడనమ్మకాలు, క్షుద్రపూజలు, నరబలి, చేతబడి లాంటి వాటి మీద చాలా మంది ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. అనారోగ్యంగా ఉన్న భార్యకు ఆసుపత్రిలో వైద్యం అందించకుండా ఆమెను భర్త మంత్రగాడి దగ్గరకు పిలుచుకుని వెళ్లాడు. మంత్రగాడు మీ ఇంటిలో పూజలు చెయ్యాలని, పూజలు చేస్తే దోషాలు పోతాయని దంపతులను నమ్మించాడు. దంపుతుల ఇంటికి మంత్రగాడు వెళ్లి పూజలు చేశాడు. కొంత కాలానికే భార్య ఆరోగ్యం కుదటపడింది. అప్పటి నుంచి మంత్రగాడు వాళ్ల ఇంటికి వచ్చి వెలుతున్నాడు. దంపతులకు ఓ కూతురు ఉంది. అక్కడే అసలు కథ మొదలైయ్యింది.

మంత్రగాడు

మంత్రగాడు

తమిళనాడులోని నాగర్ కోవిల్ కు చెందిన మణికందన్ (35) అనే వ్యక్తి నాగర్‌కోవిల్ లో అతని ఆటలుసాగవని తెలుసుకుని అదే తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం నాగర్‌కోయిల్‌కు చెందిన ఓ కూలీ అతని భార్యకు అనారోగ్యంగా ఉండటంతో రెండు సార్లు మాత్రమే ఆమెకు ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. అయితే భార్యకు మాత్రం ఆరోగ్యం కదుటపడకపోవడంతో ఆమె భర్త ఆందోళన చెందాడు.

 ఫ్యామిలీలో మంత్రగాడు ఎంట్రీ

ఫ్యామిలీలో మంత్రగాడు ఎంట్రీ

నాగర్ కోవిల్ కు చెందిన మణికందన్ అనే మాంత్రికుడి దగ్గరకు తీసుకు వెళితే నీ భార్యకు ఆరోగ్యం కదుటపడుతుందని కొందరు ఉచిత సలహా ఇచ్చారు. కార్మికుడు అతని భార్యను మాంత్రికుడు మణికందన్ వద్దకు పిలుచుకుని వెళ్లాడు. మా కుటుంబానికి ఎవరో ఏదో చేశారని, మీరే మాకు దిక్కు అంటూ ఆ కార్మికుడు మణికందన్ కాళ్ల మీద పడిపోయాడు.

 మీ ఇంటిలో పూజలు చెయ్యాలి

మీ ఇంటిలో పూజలు చెయ్యాలి


ఈ సీన్ తరువాత ఎవరో బకరాగాడు వచ్చాడని అనుకున్న మణికందన్ స్కెచ్ వేశాడు. మీ ఇంట్లో పూజలు చేయాలి, అలా చేస్తే నీ భార్యకు రోగం తగ్గిపోతుంది, మీరు సంతోషంగా ఉంటారని మాంత్రికుడు మణికందన్ ఆ దంపతులకు చెప్పాడు. మాంత్రికుడి మాటలు నమ్మిన కార్మికుడు అతని ఇంట్లో మంత్ర పూజలు చేసేందుకు అంగీకరించాడు. దీంతో మాంత్రికుడు మణికందన్ ఆ కార్మికుడి ఇంటికి వెళ్లి పూజలు చేశాడు. తరువాత ఆ కార్మికుడి ఇంటికి మాంత్రికుడు మణికందన్ తరచూ వెళ్లి వచ్చేవాడు.

కార్మికుడి కూతురి మీద ?

కార్మికుడి కూతురి మీద ?

పూజలు చేసిన కార్మిడికి 13 ఏళ్ల కుమార్తె ఉంది. కొన్ని రోజులుగగా వారి ఇంటికి వెళ్లి వస్తున్న మాంత్రికుడు మణికందన్ మైనర్ అమ్మాయి మీద కన్ను వేశాడు. పగలు పూట అమ్మాయి మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటుందని మణికందన్ తెలుసుకున్నాడు. ఇంటికి వెళ్లిన మణికందన్‌ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. మాంత్రికుడు మణికందన్ తరచూ ఇంటికి వచ్చే వ్యక్తి కావడంతో బాలిక కూడా అతడిని ఇంట్లోకి పిలిచి మాట్లాడింది.

రేప్ చేసి చంపేస్తానని బెదిరించిన మాంత్రికుడు

రేప్ చేసి చంపేస్తానని బెదిరించిన మాంత్రికుడు

అమ్మాయి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న మణికందన్ బాలికను లైంగికంగా వేధించాడు. బాలిక మీద మాంత్రికుడు మణికందన్ అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను మాంత్రికుడు మణికందన్ అమ్మాయిని బెదిరించాడు. తరువాత బాలిక జరిగిన విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరైంది.

మాంత్రికుడికి సినిమా చూపించిన పోలీసులు

మాంత్రికుడికి సినిమా చూపించిన పోలీసులు


దీంతో షాక్‌కు గురైన బాలిక కుటుంబ సభ్యులు మణికందన్‌పై నాగర్‌కోయిల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి నకిలి మాంత్రికుడు మణికందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మణికందన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. మణికందన్ ఇంకా ఎంతమంది జీవితాలతో ఇలా ఆడుకున్నాడు అని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+