"బిగ్ బాస్ 10" తెలుగు లోకి ఎంట్రీ ఇవ్వనున్న బ్యూటీలు వీళ్లే..!
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా తొమ్మిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత.. ఇప్పుడు ఈ షో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త కాన్సెప్, రెట్టింపు వినోదంతో రాబోతోన్న ఈ సీజన్ లో కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను షేర్ చేశారు.
ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కు భిన్నంగా ఈ సీజన్ 10 ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో బీబీ సీజన్ 10పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. సీజన్ 10లో కొత్త నిబంధనలు, కొత్త గేమ్స్‌తో మరింత ఆసక్తికరంగా.. వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసినట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం అంటూ సరికొత్తగా రాబోతున్న సీజన్ లో ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఎంట్రీ ఇచ్చేదీ వీరే..?
ఆట సందీప్ సతీమణి జ్యోతి
జ్యోతి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి. ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ఆట సందీప్ జీవిత భాగస్వామిగా గుర్తింపు పొందిన ఆమె, సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే భర్త సందీప్‌కు అండగా నిలుస్తూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి చేసే వీడియోలు, కుటుంబానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.
రచయిత కడలి సత్యనారాయణ
కడలి సత్యనారాయణ తెలుగు సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన రచయిత. సామాజిక అంశాలు, మానవ సంబంధాలు, గ్రామీణ జీవనశైలి వంటి అంశాలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ పాఠకుల అభిమానాన్ని పొందారు. సరళమైన శైలి, లోతైన భావ వ్యక్తీకరణ ఆయన రచనల ప్రత్యేకత. కథలు, వ్యాసాలు, నవలల ద్వారా తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
పల్లవి గౌడ
పల్లవి గౌడ దక్షిణ భారత టెలివిజన్ రంగంలో గుర్తింపు పొందిన నటి. తెలుగు, కన్నడ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమె తన నటనతో ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న పల్లవి, బుల్లితెరపై సహజమైన నటనకు ప్రసిద్ధి చెందారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిరంతరం మమేకమవుతున్నారు.












Click it and Unblock the Notifications