
Wife: భార్యను చంపేయాలని డాక్టర్ ను వేడుకున్న భర్త, లేదంటే కష్టాలు వస్తాయని డాక్టర్ కే వార్నింగ్, 420!
జైపూర్: యువతిని వివాహం చేసుకున్న వ్యక్తి ఆమెతో కొన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాడు. భార్యను అతను చాలా బాగా చూసుకుంటున్నాడని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అనుకున్నారు. నెలలో నాలుగైదుసార్లు భార్యను అతను బయటకు షికార్లకు పిలుచుకుని వెలుతున్నాడు. భార్య ప్రస్తుతం గర్బవతి. భార్య కాన్ఫూ సవ్యంగా జరగాలని, తల్లీ బిడ్డకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని అతను అతని భార్యను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి చికిత్స చేయిస్తున్నాడు.
భార్యకు చికిత్స చేస్తున్న డాక్టర్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి మీరు వైద్యం చేస్తున్న మహిళను సీక్రేట్ గా చంపేస్తే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇస్తానని, ఈ విషయం చాలా సీక్రేట్ గా ఉంటుందని చెప్పాడు. పదేపదే డాక్టర్ కు ఫోన్ చేస్తున్న వ్యక్తి గర్బవతిని చంపేయాలని మనవి చేశాడు. గర్బవతిని చంపకపోతే మీకు చాలా కష్టాలు ఎదురౌతాయని బెదిరించడం మొదలు పెట్టాడు. ఇది ఏదో తేడా వస్తోందని హడలిపోయిన ఆ డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
పోలీసుల విచారణలో గర్బవతిని చంపేయడానికి డాక్టర్ ను ప్రలోభపెట్టిన వ్యక్తిని పట్టుకున్నారనే అసలు విషయం బయటకు రావడం కలకలం రేపింది. తన భార్యను తానే చంపేస్తే పోలీసు కేసు అవుతోందని, డాక్టర్ తో చంపిస్తే అనారోగ్యంతో చనిపోయిందని అనుకుంటారని భర్త కిలాడీ స్కెచ్ వేశాడని వెలుగు చూసింది.
Actress: ప్రముఖ నటి కేసులో పోలీసు కస్టడీకి హరి నాడార్, ఆ దర్శకుడికి సపోర్టు చేసి ?, గోల్డ్ బాబుకు!

దంపతుల హ్యాపీలైఫ్
రాజస్థాన్ లోని కోటా నగరంలో పెదావ ప్రాంతంలో మంగల్ సింగ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మంగల్ సింగ్ సీమా సింగ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సీమా సింగ్ ను వివాహం చేసుకున్న మంగల్ సింగ్ ఆమెతో కొన్ని సంవత్సరాల నుంచి సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

పైకి అంతా బాగానే ఉంది
మంగల్ సింగ్ అతని భార్య సీమా సింగ్ ను అతను చాలా బాగా చూసుకుంటున్నాడని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అనుకున్నారు. నెలలో నాలుగైదుసార్లు భార్య సీమా సింగ్ ను ఆమె భర్త మంగల్ సింగ్ బయటకు పిలుచుకుని వెళ్లి సినిమాలు, షికార్లకు తిప్పాడు. పైకి మంగల్ సింగ్, సీమా సింగ్ కుటుంబ సభ్యులు బాగానే నమ్మించాడు.

గర్బవతి భార్యకు చికిత్స చేయిస్తున్న భర్త
మంగల్ సింగ్ భార్య సీమా సింగ్ ప్రస్తుతం గర్బవతి. భార్య సీమా సింగ్ ప్రస్తుతం గర్బవతి. భార్య సీమా సింగ్ కాన్ఫూ సవ్యంగా జరగాలని, తల్లీ బిడ్డకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని మంగల్ సింగ్ అతని భార్యను కోటా నగరంలోని ఎస్ఆర్ జీ ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి చికిత్స చేయిస్తున్నాడు.

డాక్టర్ కు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే?
సీమా సింగ్ కు ఎస్ఆర్ జీ హాస్పిటల్ లోనిని సీనియర్ సర్జన్ అఖిలేష్ మీనా వైద్యం అందిస్తున్నారు. భార్య సీమా సింగ్ కు చికిత్స చేస్తున్న డాక్టర్ అఖిలేష్ మీనాకు ఫోన్ చేసిన మంగల్ సింగ్ మీరు వైద్యం చేస్తున్న మహిళను సీక్రేట్ గా చంపేస్తే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇస్తానని, ఈ విషయం చాలా సీక్రేట్ గా ఉంటుందని చెప్పాడు.

నేరుగానే వెళ్లి డాక్టర్ కాళ్లు పట్టుకున్న మొగుడు
పదేపదే డాక్టర్ అఖిలేష్ మీనాకు ఫోన్ చేస్తున్న మంగల్ సింగ్ గర్బవతి అయిన తన భార్య సీమా సింగ్ ను చంపేయాలని మనవి చేశాడు. గర్బవతి సీమా సింగ్ ను చంపకపోతే మీకు చాలా కష్టాలు ఎదురౌతాయని డాక్టర్ అఖిలేష్ మీనాను బెదిరించడం మొదలు పెట్టాడు. డాక్టర్ అఖిలేష్ మీనా ఎదురు తిరగడంతో నేరుగా ఆమె ఆసుపత్రికి వెళ్లిన మంగల్ సింగ్ తన భార్య బోరుకొడుతోందని, దయచేసి మీరే చంపేయాలని ఆ డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు.

హడలిపోయిన కుటుంబ సభ్యులు
ఇది ఏదో తేడా వస్తోందని హడలిపోయిన డాక్టర్ అఖిలేష్ మీనా ఝులావర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల విచారణలో గర్బవతి సీమా సింగ్ ను చంపేయడానికి డాక్టర్ అఖిలేష్ మీనాను ప్రలోభపెట్టింది ఆమె భర్త మంగల్ సింగ్ అని వెలుగు చూడటటంతో గర్బవతి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

పక్కా 420 మొగుడు
భార్యను చంపడానికి ఆమె భర్త డాక్టర్ ను సంప్రధించాడని అసలు విషయం బయటకు రావడం రాజస్థాన్ లో కలకలం రేపింది. అయితే భార్యను హత్య చెయ్యడానికి డాక్టర్ అఖిలేష్ మీనాను ప్రలోభపెట్టిన మంగల్ సింగ్ మీద కేసు నమోదు చేశామని, అతన్ని ఇంకా అరెస్టు చెయ్యలేదని, కేసు దర్యాప్తులో ఉందని కోటా నగరం పోలీసు అధికారులు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.