Wife: ఊరు వదిలి వచ్చారు, ఆరు నెలల నుంచి ఇంట్లో ?, భార్య ఆత్మహత్య, హడలిపోయి భర్త కూడా !
బెంగళూరు/ధర్మస్థల: కొన్ని సంవత్సరాల క్రితం సంతోషంగా వివాహం చేసుకున్న దంపతులు ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. బిడ్డతో కలిసి పట్టణం చేరుకున్న దంపతులు అక్కడే నివాసం ఉంటున్నారు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం బయటకు వెలుతున్న భర్త రాత్రి ఇంటికి వెలుతున్నాడు. ఆరు నెలల క్రితం వరకు దంపతులు చాలా సంతోషంగా ఉండేవారు. తరువాత దంపతుల మద్య సమస్యలు, గొడవలు మొదలైనాయని తెలిసింది. దంపతుల గొడవ విషయం వారి కుటుంబ సభ్యులకు ఏమాత్రం తెలీకుండా ఇద్దరూ జాగ్రత్తపడ్డారు. సోమవారం ఎప్పటిలాగే భర్త వ్యాపారం పనిమీద బయటకు వెళ్లాడు, ఇంట్లో భర్త లేని సమయంలో భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న భర్త ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.

బందువులు చేసిన పెళ్లి
కర్ణాటకలోని బెళ్తంగడి సమీపంలోని కూక్కడా గ్రామంలో రాజేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు, బందువు రశ్మికా (28) అనే యువతిని వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు రాజేష్ కు చెప్పారు. పెద్దలు, కుటుంబ సభ్యులు పట్టుపడటంతో కొన్ని సంవత్సరాల క్రితం రాజేష్, రశ్మికాల వివాహం జరిగింది.

హ్యాపీలైఫ్.... సంతోషంగా ఉంటున్న దంపతులు
సంతోషంగా వివాహం చేసుకున్న హ్యాపీగా కాపురం చేసిన రాజేష్, రశ్మికా దంపతులు ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. బిడ్డతో కలిసి ధర్మస్థలం సమీపంలోని పుత్య చేరుకున్న రాజేష్, రశ్మికా దంపతులు అక్కడే నివాసం ఉంటున్నారు. భర్త రాజేష్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం బయటకు వెలుతున్న రాజేష్ రాత్రి ఇంటికి వెలుతున్నాడు.

ఆరు నెలల క్రితం నుంచి గొడవలు
భర్త రాజేష్ బయటకు వ్యాపారం చేస్తుంటే అతని భార్య రశ్మికా మాత్రం ఇంట్లో పాపను చూసుకుంటున్నది. ఆరు నెలల క్రితం వరకు రాజేష్, రశ్మికా దంపతులు చాలా సంతోషంగా ఉండేవారు. తరువాత రాజేష్, రశ్మికా దంపతుల మద్య సమస్యలు, గొడవలు మొదలైనాయని తెలిసింది. రాజేష్, రశ్మికా దంపతుల వారి గొడవ విషయం వారి కుటుంబ సభ్యులకు ఏమాత్రం తెలీకుండా ఇద్దరూ జాగ్రత్తపడ్డారని తెలిసింది.

ఉరి వేసుకున్న భార్య
సోమవారం ఎప్పటిలాగే రాజేష్ వ్యాపారం పనిమీద బయటకు వెళ్లాడు, ఆ సమయంలో ఇంట్లో అతని భార్య రశ్మికా పాపతో కలిసి ఉంది. రాజేష్ బయటకు వెళ్లిపోయిన తరువాత అతని బందువులు అతని ఇంటికి వెళ్లి రశ్మికాను మాట్లాడి వెళ్లారని తెలిసింది. ఇంట్లో భర్త రాజేష్ లేని సమయంలో అతని భార్య రశ్మికా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

భర్త ఆత్మహత్యాయత్నం
భార్య రశ్మికా ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న రాజేష్ హడలిపోయాడు. చిన్న విషయానికి భార్య రశ్మికా ఆత్మహత్య చేసుకోవడం, పోలీసులు కేసు నమోదు చేస్తే జైలుపాలు అవుతామనే భయంతో రాజేష్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గుర్తించిన స్థానికులు రాజేష్ ను రక్షించారని పోలీసులు అన్నారు. ధర్మస్థలం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న భార్య ఎలాంటి డెత్ నోట్ రాసిపెట్టలేదని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications