Wife: ఆస్తి కోసం భర్తను హౌస్ అరెస్టు చేసిన ఆంటీ, అసలు మ్యాటర్ తెలిసి పోలీసులు షాక్ !
బెంగళూరు/మండ్య: ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత దంపతులు విడిపోయారు. భర్త తల్లి చనిపోయిన తరువాత భార్య మళ్లీ భర్త ఇంటికి వెళ్లింది. పిల్లలతో కలిసి భార్య ఆమె భర్తను హౌస్ అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.
కర్ణాటకలోని మండ్యలోని నూరడిరోడ్డులో నివాసం ఉంటున్న శివస్వామి, బెంగళూరుకు చెంది జయలక్ష్మి 25 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న శివస్వామి, జయలక్ష్మి 25 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. తరువాత మండ్యలోనే శివస్వామి, జయలక్ష్మి దంపతులు కాపురం పెట్టారు.

శివస్వామి, జయలక్ష్మి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. 8 సంవత్సరాల క్రితం దంపతులు విడిపోయారు. శివస్వామి మండ్యలో, జయలక్ష్మి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఇటీవల శివస్వామి తల్లి చనిపోవడంతో జయలక్ష్మి ఆమె భర్త శివస్వామి ఇంటికి వెళ్లింది. అయితే అప్పటికే శివస్వామి, జయలక్ష్మి హెచ్ఐవీ సోకి ఆ వ్యాధితో బాధపడుతున్నారని వెలుగు చూసింది.
శివస్వామి తల్లి పేరుతో ఉన్న ఆస్తి మొత్తం అతని పేరు మీదకు మారింది. భర్త శివస్వామి పేరుతో ఉన్న ఆస్తి లాక్కోవాలని జయలక్ష్మి, ఆమె పిల్లలు కలిసి శివస్వామిని మూడు నెలల నుంచి హౌస్ అరెస్టు చేశారు. శివస్వామి అతని అక్క పుట్టతాయమ్మకు సమాచారం ఇచ్చాడు. పుట్టతాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శివస్వామిని విడుదల చేయించి జయలక్ష్మిని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications