Wife: మేడ కింద బావ, మేడ మీద భర్తతో కాపురం, భార్య గొంతు కోసి నీట్ గా చంపేసిన భర్త, అక్క చూస్తే !
చెన్నై: ఇంట్లో చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పదేపదే ఆమె అక్క ఇంటికి వెళ్లి వస్తోంది. అక్క ఇంటికి వెలుతున్న భార్యను ఆమె బావ ఇంటి దగ్గర వదులుతున్నాడు. భర్త డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. అంతేకాకుండా భార్య పదేపదే ఫోన్ లో మాట్లాడుతోంది. ఇలాంటి విషయాల్లో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. ఇటీవల ఏకంగా భార్య అక్క ఇంటి మీదకు దంపతులు కాపురం మార్చారు. సాయంత్రం ఇంట్లోకి భర్త వెళ్లాడు. తరువాత ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రాలేదు. మేడ మీద ఉన్న చెల్లి ఎందుకు బయటకు రావడం లేదని అక్క వెళ్లి పిలిచింది. తన చెల్లి, ఆమె భర్త ఏకాంతంగా ఉన్నారేమో ? అంటూ ఆమె మరుసటి రోజు వరకు సైలెంట్ గా ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యకపోవడం, మేడ మీద ఉన్న ఇంటి బయట తాళం వేసి ఉండటంతో అక్కకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా చెల్లెలిని నీట్ గా గొంతు కోసి చంపేసి మెడ మీద తడిగుడ్డ కప్పేసి వెళ్లిపోయిన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది. భార్యను హత్య చేసిన భర్త అతని ముగ్గురు పిల్లలతో కలిసి ఎస్కేప్ అయ్యాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

పిల్లలతో కలిసి హ్యాపీలైఫ్
చెన్నై సిటీలోని పూనమల్లి సమీపంలోని ఈస్ట్ లాఫ్ట్ రోడ్డు సమీపంలోని స్కూల్ స్ట్రీట్ లో ఆనంద్ రాజ్ (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆనంద్ రాజ్ సొంత ప్రాంతం పన్రూటి. ఆనంద్ రాజ్ చెన్నైలో నివాసం ఉంటున్నాడు. ఆనంద్ రాజ్ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 8 సంవత్సరాల క్రితం నందిని (28) అనే యువతిని ఆనంద్ రాజ్ వివాహం చేసుకున్నాడు. ఆనంద్ రాజ్, నందిని దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్న బావ
నందిని అక్క పవిత్ర చెన్నైలోని పూనమల్లిలో నివాసం ఉంటున్నది. ఆనంద్ రాజ్ భార్య నందిని పదేపదే ఆమె అక్క పవిత్ర ఇంటికి వెళ్లి వస్తోంది. అక్క పవిత్ర ఇంటికి వెలుతున్న నందినిని ఆమె బావ ఇంటి దగ్గర వదులుతున్నాడు. నందిని భర్త ఆనంద్ రాజ్ డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. అంతేకాకుండా ఆనంద్ రాజ్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య నందిని పదేపదే ఫోన్ లో మాట్లాడుతోందని సమాచారం.

అక్క ఇంటి మీద కాపురం
10 రోజుల క్రితం ఆనంద్ రాజ్, నందిని దంపతులు పూనమల్లిలోని పవిత్ర ఇంటి మేడ మీద అద్దె ఇల్లు తీసుకుని అక్కడికి కాపురం మార్చారు. తన భార్య నందిని వద్దని చెబుతున్నా ఆమె అక్క పవిత్ర ఇంటి మేడ మీదకు కాపురం మార్చిందని ఆనందర్ రాజ్ రగిలిపోయాడని తెలిసింది.

ఇంట్లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసేశారు
సాయంత్రం ఆనంద్ రాజ్ మేడ మీద ఉన్న అతని ఇంట్లోకి వెళ్లాడు. తరువాత ఇంటి నుంచి ఆనంద్ రాజ్, నందిని దంపతులతో పాటు వారి పిల్లలు కూడా బయటకు రాలేదు. మేడ మీద ఉన్న చెల్లి నందిని ఎందుకు బయటకు రావడం లేదని ఆమె అక్క పవిత్ర ఇంటి ముందుకు వెళ్లి పిలిచింది. తన చెల్లి నందిని, ఆమె భర్త ఆనంద్ రాజ్ ఏకాంతంగా ఉన్నారేమో ? అంటూ పవిత్ర మరుసటి రోజు వరకు సైలెంట్ గా ఉండిపోయింది.

భార్యను గొంతు కోసి చంపేసిన భర్త
ఎన్నిసార్లు ఫోన్ చేసినా నందిని ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడం, మేడ మీద ఉన్న ఇంటి బయట తాళం వేసి ఉండటంతో ఆమె అక్క పవిత్రకు అనుమానం వచ్చి స్థానికులకు విషయం చెప్పింది. నందిని అక్క పవిత్ర, స్థానికులు పూనమల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా నందినిని నీట్ గా గొంతు కోసి చంపేసి మెడ మీద తడిగుడ్డ కప్పేశారనే విషయం వెలుగు చూడటం కలకలం రేపింది.
Recommended Video

పక్కాక్లారిటీ లేదంటున్న పోలీసులు
భార్య నందిని హత్య చేసిన ఆమె భర్త ఆనంద్ రాజ్ అతని ముగ్గురు పిల్లలతో కలిసి పారిపోయాడని వెలుగు చూడటం కలకలం రేపింది. నందినిని ఆమె భర్త ఎందుకు హత్య చేశాడు ? అనే విషయం కచ్చితంగా తెలీయడం లేదని, ఆనంద్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ముగ్గురు పిల్లలతో కలిసి ఆనంద్ రాజ్ అతని బంధువుల ఇళ్లల్లో ఏమైనా తలదాచుకున్నాడా ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications