అప్పు చేసి చదివించిన భర్త .. ప్రియుడుతో జంప్ అయిన భార్య
తాను ఎలాగు చదువుకోలేదని.. భార్యను చదివించి అయిన కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా చూడాలని కోరుకున్న భర్తకు అతని భార్య దిమ్మతిరిగే షాకిచ్చింది. కష్టపడి చదివించిన భర్తను కాదని .. సదరు భార్య ప్రియుడుతో జంప్ అయింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాకు చెందిన టింకూ అనే వ్యక్తికి ప్రియతో 2020లో పెద్దలు పెళ్లి చేశారు. టింకూ మొదటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తాను చదువుకోలేదని.. తన భార్యనైనా చదువించి మంచి ఉద్యోగాన్ని చేయించాలని టింకూ భావించాడు. వెంటనే అప్పు చేసి మరి భార్య ప్రియను కాలేజ్‌లో జాయిన్ చేశాడు.

భార్య చదువు కోసం తన శక్తికి మించి అప్పు కూడా చేశాడు. ఓ సంస్థ నుంచి రూ.2.5 లక్షల లోన్ తీసుకుని మరి భార్యను నర్సింగ్ కోర్సులో చేయించాడు. లోన్ కట్టడం కోసం టింకూ డెలివరీ బాయ్‌గా కూడా పని చేశాడు. ఇక్కడ వరకూ అంతే బాగానే సాగింది.

కాలేజ్‌లో భార్య ప్రియ మరో వ్యక్తి వలలో పడింది. భర్తను కాదని దిల్ ఖుష్ అనే వ్యక్తితో ప్రేమయాణం సాగించింది. ప్రియుడు దిల్ ఖుష్‌ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రియ భావించింది. దీంతో ఇంట్లో చెప్పకుండా ప్రియుడుతో పారిపోయి.. రహస్యంగా పెళ్లి చేసుకుంది.ప్రియుడు దిల్ ఖుష్‌తో దిగిన పెళ్లి ఫొటోలను భర్త ఫోన్‌కు పంపించడంతో ..టింకూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

తాను ఎంతో కష్టపడి చదివించిన తన భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై టింకూ ఆవేదనకు గురైయ్యాడు. తన భార్యపై టింకూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య వల్ల తాను అప్పుల్లో కూరుకుపోయానని టింకూ వాపోతున్నాడు.దీనిపై విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని బాధితుడుకి పోలీసులు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications