ప్రియుడి మోజులో భర్త హత్య: ఏడేళ్ళ తర్వాత అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్యను ఏడేళ్ళ తర్వాత పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే భర్తను ప్రియుడి సహయంతో హత్య చేసింది భార్య.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

  Trs leader Srinivas Reddy and wife Sangeetha case Twist

  భర్త ముందే నవవధువుపై మామ, బంధువు గ్యాంగ్‌రేప్

  భార్య, భర్తల మధ్య మరో వ్యక్తి ప్రవేశంతో సంసారాల్లో చిచ్చులు రేగుతున్నాయి. అయితే తరహ ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. అయితే ప్రియుడి సహయంతో భర్తను హత్య చేస్తున్న ఘటనలు కొన్ని చోటు చేసుకొంటుండగా, ఈ విషయం తెలిసిన భర్త ప్రియుడిని హత్య చేస్తున్న ఘటనలు కూడ లేకపోలేదు.

  ప్రియుడు రేప్: రక్షిస్తామంటూ వచ్చి సామూహిక అత్యాచారం

  వివాహేతర సంబంధాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో స్వాతి ఉదంతం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఇదే తరహ ఘటన 7 ఏళ్ళ క్రితం తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

  వివాహేతర సంబంధం: క్రిస్మస్ వేడుకల్లో స్నేహితుడిని చంపేసిన దంతవైద్యుడు

  ప్రియుడి సహయంతో భర్తను హత్య చేసిన భార్య

  ప్రియుడి సహయంతో భర్తను హత్య చేసిన భార్య

  తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కులమన్‌కరిచల్ గ్రామానికి చెందిన సెంథిల్ కూలీ పనిచేసేవాడు. ఇతనికి భార్య ముత్తులక్ష్మి, ముగ్గురు పిల్లలున్నారు. ముత్తులక్ష్మి తాను నివాసం ఉండే ప్రాంతంలోనే దుకాణంలో పనిచేసేది.దీంతో దుకాణం యజమాని కొడుకు మారిరామర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ కారణంగానే భర్తను పథకం ప్రకారంగా భార్య హత్య చేసింది.

   మందలించిన రెండు కుటుంబాలు

  మందలించిన రెండు కుటుంబాలు

  వివాహేతర సంబంధం విషయం రెండు కుటుంబాలకు తెలియడంతో ఇద్దరిని రెండు కుటుంబాల వాళ్ళు మందలించారు.రెండు కుటుంబాలకు విషయం తెలియడంతో ప్రియుడు మారిరామర్‌తో కలిసి ముత్తు లక్ష్మి పారిపోయింది. అయితే తన భార్య కన్పించకపోవడంతో భర్త సెంథిల్ ఆమెను వెతికాడు. అయితే వెల్లిమరత్తుపట్టి వద్ద భార్య, పిల్లలు ఉన్నారని తెలుసుకొన్న సెంథిల్ అక్కడకు వెళ్ళి భార్యను తనతో రావాలని కోరారు. అప్పటికే ఆమె ప్రియుడితో అక్కడ ఉంది.

  భర్తను హత్య చేయాలని

  భర్తను హత్య చేయాలని

  భర్తను హత్య చేయాలని ప్రియుడు మారిరామర్‌తో కలిసి ముత్తులక్ష్మి ప్లాన్ చేసింది. దీంతో తనను ఇంటికి రావాలని ఒత్తిడి తెచ్చిన భర్త సెంథిల్‌ను పథకం ప్రకారంగా పోలియమ్మనూర్‌లోని తోట వద్దకు పిలిపించింది.అక్కడే దాగి ఉన్న ప్రియుడు సెంథిల్‌ను చంపేశాడు. తర్వాత పిల్లలతో సహ కడలూరుకు పారిపోయారు.

   ఏడేళ్ళ తర్వాత నిందితుల అరెస్ట్

  ఏడేళ్ళ తర్వాత నిందితుల అరెస్ట్

  ఈ హత్య తర్వాత పోలీసులు వీరిద్దరిని ఎనిమిది మాసాల తర్వాత అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలయ్యాక మరోసారి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొన్నారు. ఈ క్రమంలోనే ఏడేళ్ళ తర్వాత గురువారం నాడు పోలీసులు ఊలసత్రం వద్ద దాగి ఉన్న ముత్తులక్ష్మిని, మారిరామర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  wife killed her husband with the help of lover 7 years back in Tamilnadu. after seven years police arrested them on Thursday at Ulasatram

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి