శృంగారంలో సంతృప్తి పరచడం లేదు ..అందుకే నా మొగుడిని చంపేశా
శృంగారం అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. ఇది రెండు వ్యక్తుల మధ్య భావోద్వేగాలను, శారీరక అనుబంధాన్ని పెంపొందిస్తుంది. శృంగారం అనేది కేవలం శారీరక కార్యం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా. భారతీయ సంప్రదాయంలో శృంగారాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం దాన్ని కేవలం ఓ కార్యక్రమంలా మాత్రమే చూస్తారు. అయితే ప్రస్తుతం మన దేశంలో కూడా శృంగారానికి ఉన్న పవిత్రత తగ్గిపోతూ వస్తోంది. మన దగ్గర కూడా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి.
దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఇటీవల కాలంలో భార్య బాధితుల సంఖ్య అధికమౌతుంది. భార్యలు పిశాచులుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్న భర్తలను కడతేర్చడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. పెళ్లికి ముందో లేదా ఆ తర్వాతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తద్వారా తమ జీవిత భాగస్వామిని పై లోకాలకు పంపుతున్నారు భార్యలు.

తాజాగా ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. భర్త లైంగికంగా తనని సంతృప్తి పరచలేకపోతున్నాడని చెప్పి భర్తను పైలోకాలకు పంపింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూలై 20న మొహమ్మద్ షాహిద్ అనే వ్యక్తిని అతని భార్య కత్తితో పొడిచి హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని నిహాల్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి, అతనే కత్తితో పొడుచుకున్నాడని చెప్పింది.
అయితే, వైద్యులు పరీక్షించి అప్పటికే షాహిద్ చనిపోయాడని నిర్ధారించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. షాహిద్ ఛాతీపై ముందువైపు గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని నిర్ధారించుకున్నారు. భార్య సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా, ఆమె తన భర్తను ఎలా హత్య చేయాలా అని గూగుల్‌లో వెతికినట్టు గుర్తించారు. అల్యూమినియం ఫాస్ఫైడ్ వంటి విషపూరిత పదార్థాలను ఎలా ఉపయోగించాలి అని కూడా వెతికినట్టు తేలింది.
దీంతో పోలీసులు ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించగా, అసలు నిజం బయటపడింది. తన భర్తతో శారీరక సంబంధం పట్ల తాను అసంతృప్తి చెందినట్టు పోలీసులకు తెలిపింది. ఈ కారణంగానే తమ మధ్య గొడవ జరిగిందని, ఆవేశంలో షాహిద్ ఛాతీపై మూడుసార్లు కత్తితో పొడిచి చంపి, ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశానని నిజం ఒప్పుకుంది. ఆమె మొబైల్‌లో చాటింగ్ హిస్టరీ డిలీట్ కావడంతో, ఎవరితో చాట్ చేసిందో విచారించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications