Wife: క్లాస్ రూమ్ లో లేడీ టీచర్ గొంతు కోసిన భర్త, ఏడాది క్రితం పెళ్లి, చితకబాదిన టీచర్లు, స్టూడెంట్స్ !
భువనేశ్వర్/ హైదరాబాద్: ఏడాది క్రితం యువతి, యువకుడు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తుండటంతో వారు జీవితాంతం సంతోషంగా ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే వివాహం జరిగిన తరువాత ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి. దంపతులు ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లిన భార్య పిల్లలకు పాఠాలు చెబుతున్న సమయంలో ఆమె స్కూల్ ల్లోకి భర్త వెళ్లాడు. నీతో మాట్లాడాలని భర్త చెప్పడంతో లేడీ టీచర్ ఆమె క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. అక్కడ ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది. జోబులో ఉన్న కత్తి తీసుకున్న భర్త లేడీ టీచర్ గొంతు కోసేయడంతో ఆమె కుప్పకూలిపోయింది. స్కూల్ టీచర్లు, స్టూడెంట్స్ కలిసి లేడీ టీచర్ భర్తను చితకబాది స్కూల్ లోని ఓ గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. స్కూల్ లో పిల్లల ముందే లేడీ టీచర్ గొంతు కోయ్యడం కలకలం రేపింది.

ఇద్దరూ ప్రభుత్వ స్కూల్ టీచర్లు
ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలోని అగల్ పూర్ బ్లాక్ లోని బంధ్ బహల్ ఏరియాలో ప్రదీప్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సియుల్ గావ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రదీప్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. పుంతల బ్లాక్ లోని దుర్గాపాలి ప్రభుత్వ హైస్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న సంజూరాణి అనే యువతి ఉద్యోగం చేస్తోంది.

ఏడాది క్రితం పెళ్లి
ఏడాది క్రితం ప్రదీప్, సంజూరాణిలు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సంజూరాణి, ప్రదీప్ ఇద్దరూ ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తుండటంతో వారు జీవితాంతం సంతోషంగా ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే ఆరు నెలలు మాత్రమే ప్రదీప్, సంజూరాణి దంపతులు సంతోషంగా ఉన్నారు. తరువాత అదనపు వరకట్నం కావాలని ప్రదీప్ డిమాండ్ చెయ్యడంతో ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి.

వేర్వేరుగా కాపురం
నేను ఉద్యోగం చేస్తూ జీతం మొత్తం నీకే ఇస్తున్నానని, ఇంకా వరకట్నం ఎందుకు ఇవ్వాలని సంజూరాణి ఎదురు తిరిగింది. సంజూరాణి, ప్రదీప్ దంపతులు మద్య గొడవలు ఎక్కువ కావడంతో పెద్దలు రాజీ చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఇద్దరూ విడిపోవాలని డిసైడ్ కావడంతో పెద్లలు కూడా పంచాయితీలు చెయ్యలేక సైలెంట్ అయిపోయారు. సంజూరాణి, ప్రదీప్ ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.

భార్య స్కూల్ లో పాఠాలు చెబుతుంటే భర్త ఎంట్రీ
దుర్గాపాలిలో సంజూరాణి అద్దె ఇంటిలో నివాసం ఉంటూ అదే ఊరిలోని స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లిన సంజూరాణి పిల్లలకు పాఠాలు చెబుతున్నది. ఆ సమయంలో పంజూరాణి స్కూల్ ల్లోకి ఆమె భర్త ప్రదీప్ వెళ్లాడు. నీతో మాట్లాడాలని భర్త ప్రదీప్ చెప్పడంతో లేడీ టీచర్ సంజూరాణి ఆమె క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చింది.

స్కూల్ లో భార్య గొంతు కోసిన భర్త
క్లాస్ రూమ్ బయట సంజూరాణి, ప్రదీప్ పాండా దంపతుల మద్య మాటల యుద్దం జరిగింది. తరువాత సహనం కోల్పోయిన ప్రదీప్ పాండా జోబులో ఉన్న కత్తి తీసుకున్న లేడీ టీచర్ సంజూరాణి గొంతు కోసేయడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. స్కూల్ టీచర్లు, విద్యార్థులు కలిసి లేడీ టీచర్ భర్తను చితకబాది స్కూల్ లోని ఓ గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. మెడ తెగిపోవడంతో ఆమెను భీమాబోయి మెడికల్ కాలేజ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ లో పిల్లల ముందే లేడీ టీచర్ పంజూరాణి గొంతు కోయ్యడం కలకలం రేపింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications