బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: వ్యాపారి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, పోలీసులకు ఎమ్మెల్యే ఎవరో తెలీదంటా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులోని కగ్గలిపూర్‌లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి ప్రదీప్ కేసు ఊహించని మలుపు తిరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరో తెలీక ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి ప్రదీప్ మీద అతని భార్య నమిత గతంలో కేసు పెట్టిందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2022 మే నెలలో నమిత తన భర్త రివాల్వర్ కాల్చేస్తానని బెదిరిస్తున్నాడని నమిత బెళ్లందూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Doctor: ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసి నాలుగో భార్య?, ఆపరారేయ్ !Doctor: ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసి నాలుగో భార్య?, ఆపరారేయ్ !

అయితే వాస్తవానికి ప్రదీప్ ప్రవర్తనకు అప్పులిచ్చిన వాళ్లే కారణమని నమిత అప్పట్లో ఫిర్యాదు చేసిందని వెలుగు చూసింది. ఇంటి స్థలాలు, భూమి అమ్మి ఓ పబ్‌లో పెట్టుబడి పెట్టిన ప్రదీప్‌కు అతని భార్య సహాయం చేసింది. అప్పులు పెరిగిపోవడంతో అసహనంతో రగిలిపోయిన వ్యాపారి ప్రదీప్ ఇంట్లో అతని భార్య నమితతో నిత్యం గొడవ పడుతున్నాడని సమాచారం.

 Wife: Latest twist in Bengaluru businessman Pradeeps suicide case.

నమిత ఆమె భర్త ప్రదీప్ మీద బెల్లందూరు పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేయడంతో ప్రదీప్ మహదేవపుర ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరవింద లింబావళిని ఆశ్రయించి సహాయం చెయ్యాలని మనవి చేశాడని తెలిసింది. ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్న తరువాత పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి మీద కేసు నమోదు చేసిన పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారు. బెంగళూరు పక్కనే ఉన్న రామనగర పోలీసులకు అధికార పార్టీకి చెందిన అరవింద్ లింబావలి గురించి తెలీదని వాళ్లు చెప్పడంతో ప్రజలు షాక్ అయ్యారు. వ్యాపారి ప్రదీప్ ఆత్మహత్య కేసులో కగ్గలిపుర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అరవింద లింబావలి ఎమ్మెల్యే అని కాకుండా సామన్య వ్యక్తి అని నమోదు చెయ్యడం అనేక విమర్శలకు దారితీస్తోందని తెలిసింది.

Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?

వ్యాపారి ప్రదీప్ ఆత్మహత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ఏ3 ఆరోపిగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఎమ్మెల్యేగా కాకుండా అరవింద లింబావళిని సాధారణ వ్యక్తిగా పేర్కొనడంతో ఎమ్మెల్యే పేరును ఈ కేసులో ప్రస్తావించవద్దని పలువురు నుంచి ఒత్తిడి వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వ్యాపారి ప్రదీప్ డెత్ నోట్ ప్రామాణికతను ధృవీకరించాలని పోలీసులు నిర్ణయించారు.

డెత్ నోట్‌ ప్రదీప్ చేతిరాతో రాసి పెట్టాడని పోలీసులు అంటున్నారు. డెత్ నోట్ ప్రదీప్ రాశాడా ? లేదా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రదీప్ బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు సంప్రదించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు బ్యాంక్ చెక్కు చలాన్‌పై చేతిరాత, డెత్ నోట్‌పై రాత రెండింటినీ పరిశీలిస్తున్నారు. మొత్తం మీద బెంగళూరు వ్యాపారి ప్రదీప్ ఆత్మహత్య కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చేరడంతో ఇప్పడు ఈ కేసు గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

English summary
Wife: Latest twist in Bengaluru businessman Pradeep's suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X