Wife: లవ్ మ్యారేజ్, భార్య మీద 24 గంటలు అనుమానం, అర్దరాత్రి ఆసుపత్రిలో నిఘా, కోపంతో కూతుర్ని !
చెన్నై: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. చాలాకాలం సంతోషంగా తిరిగిన ప్రేమికులు తరువాత వివాహం చేసుకుని ప్రత్యేకంగా కాపురం పెట్టారు. వివాహం చేసుకున్న తరువాత భార్య నర్సుగా ఉధ్యోగం చేస్తున్నది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కొన్ని రోజులు డే షిఫ్ట్, కొన్ని రోజులు నైట్ షిఫ్ట్ లో ఉద్యోగం చేస్తున్నది. రాత్రిపూట ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలేస్తున్న భర్త ఎప్పుడంటే అప్పుడు ఆసుపత్రి దగ్గరకు వెళ్లి ఆమె అక్కడ ఉందా ? లేదా ? అంటూ చెక్ చేశాడు. రానురాను భార్య ప్రవర్తన మీద అనుమానం ఎక్కువ కావడంతో ఆమెను పట్టుకుని చితకబాదేశాడు.
భర్తను వదిలేసిన భార్య ఆమె ఇద్దరు పిల్లలను పిలుచుకుని వెళ్లి అద్దె ఇల్లు తీసుకుని ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నది. రాత్రి భార్య ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఆమె ఇంటి దగ్గరకు భర్త వెళ్లాడు. తరువాత ఇంట్లోకి వెళ్లి పిల్లలను మాట్లాడాడు. నేను ఇప్పుడు మీతో కలిసి లేనుకదా, రాత్రిపూట ఎవరెవరు ఇంటికి వస్తున్నారు ?, ఎంతసేపు మీ అమ్మతో ఉంటున్నారు ?, రాత్రిపూట ఇక్కడే ఉంటున్నారా ? అంటూ అతని పెద్ద కూతురికి అనేక ప్రశ్నలు వేశాడు. కూతురు అడిగిన ప్రశ్నలకు సక్రమంగా సమాధానం చెప్పడం లేదని రగిలిపోయిన తండ్రి కూతురిని కత్తితో పొడిచి దారుణంగా చంపేయడం కలకలం రేపింది. భార్య మీద అనుమానంతో కన్నతండ్రి చేతిలో కూతురు హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ప్రేమ వివాహం
చెన్నైలోని విల్లివాక్కంలో రాధాక్రిష్ణన్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 సంవత్సరాల క్రితం రాధాక్రిష్ణన్ కు లావణ్య (30) అనే యువతి పరిచయం అయ్యింది. చాలాకాలం ప్రేమికులు రాధాక్రిష్ణన్, లావణ్య హ్యాపీగా తిరిగారు. చాలాకాలం సంతోషంగా తిరిగిన ప్రేమికులు రాధాక్రిష్ణన్, లావణ్య తరువాత వివాహం చేసుకుని విల్లివాక్కంలో ప్రత్యేకంగా కాపురం పెట్టారు.

నర్సుగా ఉద్యోగం చేస్తున్న భార్య
వివాహం చేసుకున్న తరువాత లావణ్య నర్సుగా ఉధ్యోగం చేస్తున్నది. దంపతులకు 8 సంవత్సరాల వయసు ఉన్న కూతురు, ఆరు సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉన్నారు. రాధాక్రిష్ణన్ భార్య లావణ్య కొన్ని రోజులు డే షిఫ్ట్, కొన్ని రోజులు నైట్ షిఫ్ట్ లో ఉద్యోగం చేస్తున్నది. రాత్రిపూట ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న భార్య లావణ్య మీద ఆమె భర్త రాధాక్రిష్ణన్ కు అనుమానం మొదలైయ్యింది.

అర్దరాత్రి గూడాచారి అవాతరం ఎత్తిన మొగుడు
ఇంట్లో పిల్లల దగ్గర భర్త రాధాక్రిష్ణన్ ను ఉండమని చెబుతున్న లావణ్య ఆమె ఉద్యోగం చెయ్యడానికి ఆసుపత్రికి వెలుతోంది. ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలేస్తున్న రాధాక్రిష్ణన్ ఎప్పుడంటే అప్పుడు ఆసుపత్రి దగ్గరకు వెళ్లి లావణ్య అక్కడ ఉందా ? లేదా ? అంటూ చెక్ చేశాడు. రానురాను భార్య లావణ్య ప్రవర్తన మీద అనుమానం ఎక్కువ కావడంతో రాధాక్రిష్ణన్ ఆమెను పట్టుకుని చితకబాదడం మొదలు పెట్టాడు.

భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్య
భర్త రాధాక్రిష్ణన్ టార్చర్ ఎక్కువ కావడంతో లావణ్య తట్టుకోలేకపోయింది. మూడు నెలల క్రితం భర్త రాధాక్రిష్ణన్ ను వదిలేసిన అతని భార్య లావణ్య ఇద్దరు పిల్లలను పిలుచుకుని వెళ్లి అద్దె ఇల్లు తీసుకుని ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నది. పిల్లలను పిలుచుకుని లావణ్య వెళ్లిపోవడంతో ఆమెను తిరిగి ఇంటికి పిలుచుకురావాలని రాధాక్రిష్ణన్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే లావణ్ మాత్రం నీతో కలిసి కాపురం చెయ్యనని ఆమె భర్త రాధాక్రిష్ణన్ కు తేల్చి చెప్పింది.

కూతురిని ప్రశ్నలతో చిత్రహింసలు పెట్టాడు
భార్య లావణ్య ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఆమె ఇంటి దగ్గరకు రాధాక్రిష్ణన్ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో అతని ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉన్నారు. తరువాత రాధాక్రిష్ణన్ ఇంట్లోకి వెళ్లి పిల్లలను మాట్లాడాడు. నేను ఇప్పుడు మీతో కలిసి లేనుకదా, రాత్రిపూట ఎవరెవరు ఇంటికి వస్తున్నారు ?, ఎంతసేపు మీ అమ్మతో ఉంటున్నారు ?, రాత్రిపూట ఇక్కడే ఉంటున్నారా ? అంటూ అతని పెద్ద కూతురికి అనేక ప్రశ్నలు వేశాడు.

సీక్రేట్లు చెప్పలేదని కూతర్ని పొడిచి చంపేశాడు
తండ్రి రాధాక్రిష్ణన్ అడిగే ప్రశ్నలకు అతని 8 ఏళ్ల కూతురు ఏం సమాధానం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయింది. నేను ఎంత అడిగినా తల్లి లావణ్య గురించి కూతురు సరైన సమాధానం చెప్పడం లేదని రాధాక్రిష్ణన్ రగిలిపోయాడు. తరువాత ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని 8 ఏళ్ల కూతురి భుజం మీద, మెడ మీద దాడి చేశాడు. ఆ సమయంలో నొప్పి తట్టుకోలేక అమ్మాయి కేకలు వేసింది. ఏడిస్తే చంపేస్తానని రాధాక్రిష్ణన్ అతని కూతురిని బెదిరించాడు. నొప్పి తట్టుకోలేక ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో రాధాక్రిష్ణన్ సహనం కోల్పోయి కత్తితో కన్న కూతురి గొంతు కోసేసి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు.

కూతుర్ని చంపేసి లొంగిపోయిన తండ్రి
చిన్నకూతురు గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు విషయం గుర్తించి ఆసుపత్రిలో ఉన్న లావణ్యకు సమాచారం ఇచ్చారు. లావణ్య వెంటనే కూతురిని విల్లివాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అప్పటికే అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారు. కూతురిని హత్య చేసి పారిపోయిన రాధాక్రిష్ణన్ తరువాత భయపడి అతనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య లావణ్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని, ఆ కోపంలో తానే కూతురిని చంపేశానని రాధాక్రిష్ణన్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. భార్య మీద అనుమానంతో కన్నకూతురిని తండ్రి హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications