Wife: భార్య మీద అనుమానం, బెడ్ రూమ్ లో గొంతు చీల్చి దారుణంగా చంపిన భర్త !
సూరత్/ ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు పెళ్లి జరిగి 20 సంవత్సరాలు దాటిపోయింది. దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. ఇంటర్ చదువుతున్న కొడుకు, కూతురు ఉన్న సమయంలో భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. బెడ్ రూమ్ లో భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త చేతులు దుపులుకున్నాడు.
చాలాకాలం నుంచి భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని వ్యాపారికి అనుమానం పెరిగిపోయి ఆమెను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. సూరత్ లోని బృందావన్ రెసిడెన్సీ ఏరియాలో సురభా జలా, అతని భార్య హంసా నివాసం ఉంటున్నారు. 22 ఏళ్ల క్రితం సురభా, హంసా దంపతులకు వివాహం అయ్యింది.

సురభా జలా, హంసా దంపతులకు 19 ఏళ్ల కుమారుడు, 16 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హోల్ సేల్ వ్యాపారం చేస్తున్న సురభా జలా మూడు సంవత్సరాల క్రితం వరకు అతని భార్య హంసాతో చాలా సంతోషంగా జీవించాడు. అయితే మూడు సంవత్సరాల నుంచి సురభా జలా అతని భార్య హంసా మీద అనుమానం పెంచుకున్నాడు.
నా భార్య హంసా అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని రగిలిపోయాడు. రాత్రి ఇంటికి వెళ్లిన సురభా హంసా అతని కొడుకును అంగడికి పంపించాడు. కూతురు స్నానం చెయ్యడానికి బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో భార్య హంసాను బెడ్ రూమ్ లోకి లాక్కొని వెళ్లిన సురభా జలా అతని భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. తన తల్లి హంసాను తన తండ్రి సురభా జలా హత్య చేశాడని వాళ్ల కొడుకు, కూతురు సాక్షం చెప్పారని పోలీసులు అన్నారు. భార్యను హత్య చేసిన సురభా జలాను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications