Wife: రాత్రి హ్యాపీగా ఎంజాయ్, పగలు పంచాయితీలు, భార్యను నరికి చంపిన భర్త, కొడవలి ఎత్తుకుని !
న్యూఢిల్లీ/చెన్నై: పెళ్లి వయసుకు వచ్చిన బిడ్డలు ఇంట్లో ఉన్నా దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి మాత్రం భార్య, భర్త కలిసి మద్యం సేవించడం అలవాటుగా పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంత నచ్చచెప్పినా దంపతుల మద్య గొడవలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. రానురాను భార్య రెచ్చిపోవడంతో అతని భర్తకు ఎక్కడో మండిపోయింది. మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన భర్త కొడవలి తీసుకుని భార్యను నరికి చంపేశాడు. భర్తను నరికిన కొడవలి తీసుకుని రక్తం కారుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన స్టోరీ మొత్తం చెప్పడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

పెళ్లి వయసు వచ్చిన పిల్లలు
ఢిల్లీలోని మంగోలిపురలో సమీర్ (45), సబానా (40) దంపతులు నివాసం ఉంటున్నారు. సమీర్, సబానా దంపతులకు 21 సంవత్సరాలు, 17 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత నుంచి సమీర్, సబానా దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

పోటాపోటిగా మద్యం సేవిస్తున్న దంపతులు
సమీర్ మద్యం సేవించేవాడు. భర్త సమీర్ తో పాటు అతని భార్య సబానా కూడా మద్యం సేవించేది. ప్రతిరోజు సబానా, సమీర్ దంపతులు ఒకరిని మంచి ఒకరు పోటాపోటీగా మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవించే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో మద్యంకు బానిసలు అయిన దంపతులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తించారు.

భార్య మీద అనుమానం
భార్య సబానా మీద ఆమె భర్త సమీర్ కు అనుమానం ఉంది. మద్యం మత్తులో ఉన్న తనను మోసం చేసి తనభార్య వేరే వ్యక్తితో కులుకుతోందని భర్త సమీర్ కు అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విఫయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. మద్యం మత్తులో రాత్రి సమీర్, సబానా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

భార్యను నరికి చంపిన భర్త
రాత్రి గొడవ ఎక్కువ కావడంతో కూతుర్లు ఇద్దరూ సబానా, సమీర్ కు నచ్చచెప్పారు. రాత్రి మద్యం మత్తులో సైలెంట్ గా నిద్రపోయిన సమీర్ ఉదయం 7. 30 గంటలకు మళ్లీ ఒక క్వాటర్ మందు వేసి రెచ్చిపోయాడు. అదే సమయం భార్య సబానా ఎదురు తిరగడంతో సమీర్ సహనం కోల్పోయాడు. కొడవలి తీసుకున్న సమీర్ భార్య సబానాను దారుణంగా నరికేశాడు. వెంటనే సబానాను సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స విఫలమై ఆమె చనిపోయింది.

సార్ జరిగిన స్టోరీ ఇదే
భార్య సబానాను హత్య చెయ్యడానికి ఉపయోగించిన కొడవలి చేతిలో పట్టుకున్న సమీర్ నేరుగా మంగోల్ పురి పోలీస్ స్టేషన్ కు బయలుదేరాడు. కొడవలికి రక్తం కారుతున్నా సమీర్ ఏమాత్రం పట్టించుకోలేదు. తన భార్య సబానాను ఎందుకు హత్య చేశానో అనే విషయం చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

లిక్కర్ ఫ్యామిలీ
మద్యంకు బానిసలు అయిన దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని, భార్య సబానా మీద సమీర్ కు అనుమానం ఉండేదని, అందుకే హత్య చేశాడని డిప్యూటీ పోలీస్ కమీషనర్ పర్వీందర్ సింగ్ మీడియాకు చెప్పారు. భార్య సబానాను ఆమె భర్త సమీర్ హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం కలకలం రేపింది. తన తల్లి సబానాను తన తండ్రి సమీర్ హత్య చేశాడని వాళ్ల కూతురే సాక్షం చెప్పిందని డిప్యూటీ పోలీస్ కమీషనర్ పర్వీందర్ సింగ్ మీడియాకు చెప్పారు.
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications