Wife: భార్య మొబైల్ నెంబర్ కు మిస్డ్ కాల్, నేరుగా వెళ్లి బంధువును లేపేసిన భర్త, అసలు మ్యాటర్ వేరే !
బెంగళూరు/ విజయపురం: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువులు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. బంధువుల్లోని రెండు కుటుంబాల్లో గొడవలు ఉన్నాయని తెలిసింది. గొడవలు ఉన్నా ఎవరిపాటికి వాళ్లు ఉంటూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. తన భార్యతో తన బంధువు చనువుగా ఉంటున్నాడని ఓ వ్యక్తికి చాలాకాలం నుంచి అనుమానం ఉంది. ఇదే విషయంలో నువ్వు మా ఇంటికి రాకూడదని భర్త అతని బంధువుకు చెప్పాడు. బంధువు కూడా అతని భార్యతో కలిసి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్లిన వ్యక్తి ఫోన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు.
అదే సమయంలో బంధువు మొబైల్ ఫోన్ నుంచి భార్య ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ వెళ్లింది. ఇప్పటికే తన భార్యతో చనువుగా ఉంటున్నాడని బంధువు మీద రగిలిపోతున్న భర్త ఇంట్లోనే ఉండటం, భార్య మొబైల్ ఫోన్ కు అతని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ రావడంతో ఇంకా రగిలిపోయాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన భర్త నా భార్యకు ఎందుకు ఫోన్ చేశావు అంటూ గొడవ పెట్టుకున్నాడు. పొరపాటున మీకు ఫోన్ చేశానని, నేను వేరే వ్యక్తికి ఫోన్ చెయ్యబోయి మీకు ఫోన్ చేశానని బంధువు చెప్పాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త అతని భార్యకు మిస్డ్ కాల్ ఇచ్చిన వ్యక్తిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వలస వచ్చిన కుటుంబాలు
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని మానగాంవ తాులకాలోని పావసుళవాడి గ్రామానికి చెందిన సోనూ లక్ష్మణ్ అలియాస్ సోనూ (35) అనే వ్యక్తి అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కర్ణాటకలోని విజయపుర తాలుకా తాళికోటి ప్రాంతంలో నివాసం ఉంటూ పొలం లీజుకు తీసుకుని పనులు చేయిస్తున్నారు. సోనూ బంధువులు చాలా మంది ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

సోనూకు బంధువు
సోనూ బంధువు గోపాల మధు జాధవ్ అనే వ్యక్తి కూడా అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విజయపురలోని తాళికొటి ప్రాంతంలో మరో పొలం లీజుకు తీసుకుని అక్కడ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మహారాష్ట్రలోని సోనూ నివాసం ఉంటున్న ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువులు ఇక్కడే నివాసం ఉంటూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు.

భార్య, సోనూ మీద జాదెవ్ కు అనుమానం
బంధువుల్లోని సోనూ. జాదెవ్ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయని తెలిసింది. గొడవలు ఉన్నా సోనూ, జాదెవ్ ఎవరిపాటికి వాళ్లు ఉంటూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు. తన భార్యతో తన బంధువు సోనూ చనువుగా ఉంటున్నాడని జాదెవ్ కు చాలాకాలం నుంచి అనుమానం ఉంది. ఇదే విషయంలో నువ్వు మా ఇంటికి రాకూడదని జాదెవ్ అతని బంధువుకు సోనూకు గట్టిగా చెప్పాడు

భార్య ఫోన్ కు మిస్డ్ కాల్ ఇచ్చిన బంధువు
పని ముగించుకుని ఇంటికి వెళ్లిన సోనూ ఫోన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. అదే సమయంలో సోనూ మొబైల్ ఫోన్ నుంచి జాదెవ్ భార్య ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ వెళ్లింది. ఇప్పటికే తన భార్యతో సోనూ చనువుగా ఉంటున్నాడని అతని ఊగిపోతున్న అతని బంధువు జాదెవ్ ఇంట్లోనే ఉండటం, భార్య మొబైల్ ఫోన్ కు అతని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ రావడంతో ఇంకా రగిలిపోయాడు.

బయటకు పిలిచి కత్తితో పొడిచి చంపేశాడు
ఇంటి నుంచి బయటకు వెళ్లిన జాదెవ్ నేరుగా సోనూ ఇంటి దగ్గరకు వెళ్లాడు. నా భార్యకు ఎందుకు ఫోన్ చేశావు అంటూ జాదెవ్ అతని బంధువు సోనూతో గొడవ పెట్టుకున్నాడు. నేను వేరే వ్యక్తికి ఫోన్ చెయ్యబోయి పొరపాటున మీ భార్యకు ఫోన్ చేశానని సోనూ చెప్పాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన జాదెవ్ అతని భార్యకు మిస్డ్ కాల్ ఇచ్చిన సోనూను దారుణంగా పొడిచి హత్య చెయ్యడం కలకలం రేపింది. భార్యకు మిస్డ్ కాల్ ఇచ్చిన సోనూను హత్య చేసిన జాదెవ్ ను అరెస్టు చేశామని విజయపుర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications