Wife: దుబాయ్ లో భర్త, ఉద్యోగం చేస్తున్న భార్యకు ?, దుబాయ్ నుంచి వచ్చి మొగుడు ఏం చేశాడంటే !
చెన్నై/ తిరుచ్చి: ప్రేమించిన యువతిని ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కుమారుడు పుట్టాడు. ఉద్యోగం చెయ్యడానికి భర్త దుబాయ్ వెళ్లిపోయాడు. కుమారుడిని అత్త దగ్గర వదిలిపెట్టిన భార్య ఇక్కడే ఉద్యోగం చేస్తోంది. కొన్ని సంవత్సరాల తరువాత భర్త దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చాడు. ఇదే సమయంలో భార్య గురించి దుబాయ్ మొగుడికి కొన్ని సీక్రేట్ లు తెలిశాయి. ఉదయం భార్యను బైక్ లో పిలుచుకుని వెళ్లి ఆమె ఉద్యోగం చేస్తున్న చోట వదిలిపెట్టాడు. తరువాత భార్య వచ్చి చూస్తే భర్త, కొడుకు, అత్త శవాలై కనిపించారు. దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే తల్లి, కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకునే ముందు అతను ఓ డెత్ నోట్ రాసిపెట్టాడు.

10 ఏళ్ల క్రితం లవర్స్
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని తిరువణ్ణామలైలోని కావల్ అయ్యన్ వీధిలోని అపార్ట్ మెంట్ లో లక్ష్మణన్, వసంత (68) దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మణన్, వసంత దంపతులకు కార్తికేయా (35) అనే కుమారుడు ఉన్నాడు. 10 సంవత్సరాల క్రితం కార్తికేయా వసంతప్రియా అలియాస్ ప్రియా అనే యువతిని ప్రేమించాడు.

దుబాయ్ వెళ్లిన భర్త
కొంతకాలం ప్రేమించిన యువతి ప్రియాను కార్తికేయా వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కార్తికేయా, ప్రియా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు 7 సంవత్సరాల వయసు ఉన్న స్వామినాథన్ అనే కుమారుడు ఉన్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగం చెయ్యడానికి కార్తికేయన్ దుబాయ్ వెళ్లిపోయాడు.

భర్త ఒక్కసారికూడా రాలేదు
భర్త కార్తికేయా దుబాయ్ కి వెళ్లిన తరువాత అతని భార్య ప్రియా తిరువణ్ణామలైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కొడుకు స్వామినాథన్ ను అత్త వసంత దగ్గర వదిలిపెడుతున్న ప్రియా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. దుబాయ్ లో ఉంటున్న కార్తికేయన్ ప్రతిరోజు అతని భార్య ప్రియా, కొడుకు, తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు.

భర్తకు షాక్ మీద షాక్
నాలుగు సంవత్సరాల నుంచి కార్తికేయన్ ఒక్కసారికూడా సొంత ఊరికిరాలేదు. నాలుగు రోజుల క్రితం కార్తికేయన్ దుబాయ్ నుంచి తిరువణ్ణామలైకి వచ్చాడు. ఇదే సమయంలో దుబాయ్ మొగుడు కార్తికేయన్ కు అతని భార్య ప్రియా గురించి కొన్ని సీక్రేట్ లు తెలిశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ప్రియా గురించి తెలుసుకున్న కార్తికేయన్ హడలిపోయాడని తెలిసింది.

భార్య ఫోన్ చేసినా భర్త రిసీవ్ చెయ్యలేదు
ఉదయం భార్య ప్రియాను స్నేహితుడి బైక్ లో పిలుచుకుని వెళ్లిన కార్తికేయన్ ఆమె ఉద్యోగం చేస్తున్న చోట వదిలిపెట్టాడు. తరువాత కార్తికేయన్ ఇంటికి వెళ్లిపోయాడు. మద్యాహ్నం ప్రియా ఆమె భర్త కార్తికేయన్ కు చాలాసార్లు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భర్త కార్తికేయన్ ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో ఆందోళనతో అతని భార్య ప్రియా ఇంటికి వెళ్లింది.

తల్లి, కొడుకుతో కలిసి దుబాయ్ మొగుడు ఆత్మహత్య
ప్రియా ఇంటికి వెళ్లి చూస్తే ఆమె భర్త కార్తికేయన్, కొడుకు స్వామినాథన్, అత్త వసంత ఇంటిలో శవాలై కనిపించారు. దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే కార్తికేయన్ అతని తల్లి వసంత, కొడుకు స్వామినాథన్ తో కలిసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు కార్తికేయన్ డెత్ నోట్ రాసిపెట్టాడు. నా భార్య ప్రియా చాలాబాగా చదువుకుంది. ఆమెకు ఏం చెయ్యాలో తెలుసు, మా ఆత్మహత్యల గురించి పోలీసులు దర్యాప్తు చెయ్యకూడదని అందులో రాసి ఉందని తిరువణ్ణామలై పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications