చేపలకూర వండలేదని మారం.. ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన భర్త..
అప్పుడప్పుడు చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. భార్య, భర్తల మధ్య గొడవలు కామనే. కానీ చిన్న విషయాలకు ఘర్షణ పడటం కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. కానీ ఓ భర్త మాత్రం భార్యపైనే అలిగాడు. అలిగి నానా హంగామా చేశాడు. ఏకంగా ట్రాన్స్ పార్మర్ ఎక్కి.. మరీ రచ్చ రచ్చ చేశాడు. ఈ విచిత్ర ఘటన బీహర్ రాష్ట్రంలో జరిగింది. అసలు విషయం తెలిసీ పోలీసులు ఖంగుతిన్నారు.
భార్యతో గొడవ పడిన భర్త ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు. చనిపోతా అని నానా రచ్చ చేశాడు. దిగమని చెప్పినా వినిపించుకోలేదు. బంధువులు, జనం అంతా అక్కడ గుమిగూడారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎందుకు అతడు ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడని పోలీసులు భార్యను ప్రశ్నించారు. ఆమె చెప్పింది విని నోరు తెరిచారు. పుర్నియాకు చెందిన సంతోష్ రాయ్ బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే భార్య అతడికి అన్నం పెట్టింది. దాంతో సంతోష్ గొడవ మొదలైంది.

గొడవకు గల కారణం.. చేపల కూర. అప్పటికప్పుడు వండలేనని భార్య చెప్పడమే పాపమైపోయింది. విలువ లేదు.. నేనంటే లెక్కలేదు. చస్తేనే మీకు తెలిసొస్తుంది అంటూ గట్టిగా కేకలు వేశాడు. వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఎక్కాడు. కిందకు అస్సలు దిగలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి కిందకు దిగాల్సిందిగా కోరారు. పోలీసులకు విసుగొచ్చి.. చేపల కూరను తెప్పిస్తామని చెప్పారు. కిందకు దిగి రావాలని నచ్చజెప్పి ఎలాగొలా కిందకు దింపారు.
11 వేల వోల్టుల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కినా.. రాత్రి కరెంట్ లేకపోవడంతో సంతోష్ బతికిపోయాడు. లేదంటే సీన్ మరోలా ఉండేది. అయినా చేపల కూర కోసం ఏకంగా ట్రాన్స్ ఫార్మర్ ఎక్కడం ఏంటీ అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications