ఉద్వేగంతో.. జైలులోనే కన్నీటిపర్యంతమైన డేరాబాబా!
అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా మాజీ చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ ను మంగళవారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.
చండీగఢ్: అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా మాజీ చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ ను మంగళవారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.
దీపావళిని పురస్కరించుకుని గుర్మీత్ భార్య హర్జీత్ కౌర్, కుమార్తె, చరణ్ ప్రీత్, కుమారుడు జస్మీత్ సింగ్, కోడలు సన్మీత్, అల్లుడు అమర్ ప్రీత్ సునారియా జైలుకు వెళ్లి ఆయనను పరామర్శించారు.
కుటుంబ సభ్యులను చూడగానే డేరాబాబా జైలులోనే కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. వారిని చూడగానే ఆయన ఉద్వేగాన్ని అణుచుకోలేక ఏడ్చేశారని సమాచారం.

కుటుంబ సభ్యులు ఆయనను ఓదార్చి.. తాము తీసుకొచ్చిన స్వీట్లు, చలికాలంలో వేసుకునే దుస్తులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ డేరా బాబా కుటుంబ సభ్యులు సుమారు గంటన్నరపాటు ఆయనతో మాట్లాడినట్టు తెలిపారు.
వాస్తవానికి జైలు నిబంధనల ప్రకారం సందర్శకులను మధ్యాహ్నం 2 గంటలకు అనుమతించాల్సి ఉండగా, డేరాబాబా భద్రత దృష్ట్యా అయనను చూసేందుకు వారిని 3 గంటలకు అనుమతించినట్లు చెప్పారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications