Wife: రెండో భార్య గర్బవతి, భర్తకు డౌట్, భార్య, కొడుకు హత్య, ఆంటీ జస్ట్ మిస్, 8 ఏళ్లు అజ్ఞాతంలో !
చెన్నై/నెల్లూరు: పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో విడాకులు తీసుకున్నాడు. భర్త చనిపోవడంతో ఓ మహిళ మహిళ ఆమె కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నది. కొంతకాలం ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. మొదటి భర్త కారణంగా ఏడు సంవత్సరాల వయసు ఉండే కొడుకు ఉన్న మహిళను ఆమె ప్రియుడు పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం ఇద్దరూ కాపురం చేశారు. తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన రెండో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. అంతే ఇంట్లో గొడవలు జరిగాయి.
సహనం కోల్పోయిన భర్త అతని రెండో భార్యను, ఆమె మొదటి భర్త కొడుకును, అత్తను కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. చికిత్స విఫలమై రెండో భార్య, ఆమె కొడుకు చనిపోయారు. అత్త ప్రాణాలతో భయటపడింది. రెండో భార్య, ఆమె కొడుకును చంపేసిన భర్త 8 ఏళ్ల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. అయితే టెక్నాలజీ సహాయంతో 8 ఏళ్ల తరువాత జంట హత్యల కేసులో కేటుగాడిని పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో అరెస్టు చేశారు. మా అత్తను కూడా చంపేసి తానే లొంగిపోదాము అనుకుంటున్న సమయంలో మీరు పట్టుకున్నార్ సార్ అని అతను చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

భార్యతో విడాకులు తీసుకున్నాడు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో రాజు అలియాస్ డేంజర్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 సంవత్సరాల క్రితం చెన్నై వెళ్లిన రాజు మేస్త్రీగా పని చేసేవాడు. రాజు అతని మొదటి భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండేవాడు. చెన్నైలోని వాషర్ మెన్ పేట్ కు చెందిన గుణసుందరి అనే మహిళ ఆమె భర్త చనిపోవడంతో ఆమె 7 ఏళ్ల కొడుకుతో కలిసి నివాసం ఉండేది.

రెండో పెళ్లి చేసుకున్నారు
2014లో రాజుకు, గుణసుందరికి పరిచయం అయ్యింది. కొంతకాలం రాజు, గుణసుందరి చనువు పెంచుకుని, తరువాత అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. మొదటి భర్త కారణంగా ఏడు సంవత్సరాల వయసు ఉండే కొడుకు ఉన్న గుణసుందరిని ఆమె ప్రియుడు పెళ్లి చేసుకున్నాడు. రెండు సంవత్సరాలు వాషర్ మెన్ పేట్ లోనే రాజు, గుణసుందరి కాపురం చేశారు.

భార్య మీద అనుమానంతో ?
కొంతకాలం తరువాత రాజు, గుణసుందరి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో గుణసుందరి గర్బవతి అయ్యింది. తన రెండో భార్య గుణసుందరి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని రాజుకు అనుమానం మొదలైయ్యింది. అంతే రోజూ ఇంట్లో గొడవలు జరిగాయి. సహనం కోల్పోయిన రాజు అతని రెండో భార్య గుణసుందరి, ఆమె మొదటి భర్త కొడుకు మహేష్ కుమార్ ను, అత్త (గుణసుందరి తల్తి)ని కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

ఇద్దరిని చంపేసి ఆంధ్రప్రదేశ్ కు ఎస్కేప్
కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్న గుణసుందరి, ఆమె కొడుకు మహేష్ కుమార్ చికిత్స విఫలమై చనిపోయారు. గుణసుందరి తల్లి ప్రాణాలతో భయటపడింది. రెండో భార్య గుణసుందరి, ఆమె కొడుకును చంపేసిన రాజు ఆంధ్రప్రదేశ్ కు పారిపోయి అక్కడే తలదాచుకుని 8 ఏళ్ల నుంచి చెన్నై సిటీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

టెక్నాలజీ ఉపయోగించిన పోలీసులు
జంట హత్యల కేసులో రాజు కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. చెన్నైలో మేస్త్రీగా పని చేసే రాజు కోసం ఆరా తీశారు. తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గ్రామాల్లో రాజు బంధువులు నివాసం ఉంటున్నారని చెన్నై సిటీ పోలీసులు తెలుసుకున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రాజు ఫోటో ముద్రించి ఇతను హంతకుడు అని, మేస్త్రీ పని చేస్తున్నాడని ,ఇతని ఆచూకి చెప్పాలని మనవి చేస్తూ ముద్రించిన పాంప్లెట్లు ఆంధ్రప్రదేశ్, తమిలనాడు పోలీసుల వాట్సాప్ గ్రూప్ ల్లో వైరల్ చేశారు.

పని చేసేవాళ్లే పట్టించారు
సత్యవేడులో తలదాచుకున్న రాజు మేస్త్రీగానే పని చేస్తున్నాడు. రాజు జంట హత్యలు చేశాడని ఆ పాంప్లెట్లు చూసిన అతని దగ్గర పని చేసే ముగ్గురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వియం తెలుసుకున్న చెన్నై సిటీలోని వాషర్ మెన్ పేట్ పోలీసులు సత్యవేడు చేరుకుని రాజును అరెస్టు చేశారు. మా అత్తను కూడా చంపేసి తానే లొంగిపోదాము అనుకుంటున్న సమయంలో మీరు పట్టుకున్నార్ సార్ అని రాజు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications